ప్రతి పేరెంట్స్ పిల్లలకు ఈ విషయాలు నేర్పించాలి..!

First Published | Feb 9, 2024, 1:45 PM IST

పిల్లలను ధృఢంగా ఉండేలా ప్రోత్సహించాలి. అప్పుడే వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ముందడుగు వేస్తారు. వచ్చిన కష్టాలను ఒక పాఠంగా మార్చుకోవడం కూడా నేర్పించాలి.

ప్రతి పేరెంట్స్ తమ పిల్లల విషయంలో చాలా ఆశలు పెట్టుకుంటారు. తమ పిల్లలకు మంచి బుద్ధులు రావాలని.. అందరి చేత ప్రశంసలు అందుకోవాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు.. చదువులో, గేమ్స్ లో అన్నింట్లోనూ టాప్ ఉండాలని కోరుకుంటారు. అయితే.. ఇవి మాత్రమే కాదు ఒక పేరెంట్ గా మనం పిల్లలకు కొన్ని వాల్యూస్ కూడా నేర్పించాలి. అంటే లైఫ్ లెసెన్స్ కచ్చితంగా నేర్పించాలి. మరి ఎలాంటి లెసెన్స్ మనం వారికి నేర్పించాలో ఇప్పుడు చూద్దాం..

చాలా మంది పిల్లలు ఇతరుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు. కానీ.. మనం పిల్లలకు ఇతరుల పట్ల జాలి, దయగా ఉండటం నేర్పించాలి. ఇతరులతో ఎంత సానుభూతిగా  ఉండటం, ఇతరుల అభిప్రాయాలను గుర్తించడం ఎలాగో వారికి నేర్పించాలి. ఈ విషయాల్లో మనం పిల్లలను కచ్చితంగా ప్రోత్సహించాలి.


చాలా మంది పిల్లలు చిన్న విషయాలకే ఎక్కువ భయపడుతూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వారు మొదట భయపడిపోతారు. ముందుకు అడుగువేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఉండకుండా.. పిల్లల్లో పట్టుదల, ధైర్యం నేర్పించాలి. పిల్లలను ధృఢంగా ఉండేలా ప్రోత్సహించాలి. అప్పుడే వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ముందడుగు వేస్తారు. వచ్చిన కష్టాలను ఒక పాఠంగా మార్చుకోవడం కూడా నేర్పించాలి.

వారు చేసిన పనికి వారిని జవాబుదారులుగా ఉండటం నేర్పించాలి. చాలా మంది పిల్లలు వాటి నుంచి తప్పించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ.. వారు చేసే పనులకు వారే బాధ్యత వహించేలా  మనం నేర్పించాలి. అంతేకాదు.. పిల్లలకు చిన్న తనం నుంచే కొన్ని బాధ్యతలు అప్పగించాలి. వారు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే.. ఏం జరుగుతుంది అనే విషయం వారికి అర్థమయ్యేలా చేయాలి.

ఈ రోజుల్లో పిల్లలకు నిజం చెప్పాలంటే మర్యాద తెలియడం లేదు. ఇంట్లో వాళ్లు, బయటి వాళ్లు అనే తేడా లేకుండా.. అందరితోనూ అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. కానీ.. వారికి మనం అది నేర్పించాలి.  పెద్దలకు, వయసుకు, మతానికీ,  జెండర్ కీ మర్యాద ఇవ్వడం నేర్పించాలి.

చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు ఏ కష్టం రాకూడదు అని అనుకుంటారు. నిజానికి అందరు పేరెంట్స్ ఇది కోరుకుంటారు. కానీ.. వారికి ఏదైనా చిన్న సమస్య ఏదురైనా మీరే దూరిపోయి దానిని పరిష్కరించకూడదు. సాధ్యమైనంత వరకు చిన్న సమస్యలు అయితే.. వాటిని పిల్లలే పరిష్కరించేలా ప్రోత్సహించాలి. వారి చేతుల్లో లేనప్పుడు.. మీరు పరిష్కరించవచ్చు. ముందు వారికి ఛాన్స్ ఇవ్వడంలో వల్ల.. వారిలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది.

parenting model

ప్రతి ఒక్క పిల్లవాడు చాలా డిపరెంట్ గా ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో టాలెంట్ ఉంటుంది. దానిని మనం గుర్తించాలి. ఇతర పిల్లలతో పోల్చి తక్కువ చేయకూడదు. వారు చేసిన గొప్ప పనిని మాత్రం ప్రోత్సహించాలి. అప్పుడే వారిలో  కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదే విధంగా ఇతరులను మెచ్చుకోవడం కూమా మనం పిల్లలకు నేర్పించాలి.

చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఏది అడిగినా కొనిపెట్టేస్తూ ఉంటారు. అది వాళ్ల ప్రేమ కావచ్చు. కానీ పిల్లలకు డబ్బుల విషయంలో పాఠాలు నేర్పించాలి. లేకపోతేవారు.. జీవితంలో డబ్బు విలువ తెలుసుకోలేరు. చిన్నతనం నుంచే దీనిని అలవాటు చేయాలి. కొన్ని వస్తువులను వారితో కొనిపించడం, డబ్బులు ఎలా సేవ్ చేయాలో.. ఏది అవసరం.. ఏది అవసరం లేదు లాంటి విషయాలు తెలిసేలా చేయాలి. దీని వల్ల పిల్లల్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుస్తుంది.

పిల్లలు మట్టిలో ఆడుకోవడం సహజం. దాని వల్ల వారి మురికిగా అవుతారు. అయితే.. పిల్లలే కదా అని వదిలేయకూడదు. వారిని వారు శుభ్రంగా ఉంచుకోవడం అవసరం. ఈ విషయాన్ని కూడా మనం నేర్పించాలి. హైజెనిక్ గా ఉండటం ఎంత అవసరం.. అది ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలియజేయాలి. క్లీనింగ్ పట్ల కేర్ తీసుకునేలా చేయాలి.

Parenting

ఇక పేరెంట్స్ ప్రతిరోజూ కొంత సమయం అయినా పిల్లలతో ఏకాంతంగా కూర్చొని మాట్లాడుతూ ఉండాలి. మీరు వారితో కమ్యూనికేషన్ విషయంలో ఓపెన్ గా ఉండాలి. వారితోనూ కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో నేర్పించాలి. వారు తమ ఫీలింగ్స్, ఆలోచనలు అన్నీ చెప్పుకునే ఫ్రీడమ్ మీరు ఇవ్వాలి. వారు చెప్పేది మీరు కూడా ఓపికగా వినాలి.

Latest Videos

click me!