చైల్డ్ సేఫ్ ఏరియాను సిద్ధంగా ఉంచుకోండి
పిల్లవాడు నిద్రపోయే చోట హాని చేసే వస్తువులు ఉండకుండా చూసుకోవాలి. అలాగే వారికి గాయాలయ్యే వాటిని కూడా ఉంచకూడదు. అప్పుడే వారు హాయిగా అటూ ఇటూ నడవగలుగుతారు. ఆడుకోగలుగుతారు. అలాగే వారు ఆడుకునే చోట మృదువైన బొమ్మను పెట్టండి. స్విచ్ బోర్డ్ కు కవర్ ను పెట్టండి. మంచం మూలల్లో బెడ్ కార్నర్ ప్రొటెక్టర్ ఉంచండి. దీంతో మీరు హాయిగా నిద్రపోవచ్చు. అలాగే మీ పిల్లలు సేఫ్ జోన్ లో ఉంటారు. ఇది మీ పిల్లలను సురక్షితంగా ఉంచుతుంది.