మీ పిల్లల కళ్లు బాగా కనిపించాలంటే ఈ ఫుడ్స్ పెట్టండి

First Published | Feb 13, 2024, 3:49 PM IST

ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే కళ్లద్దాలు వచ్చేవి. ఇప్పుడు చిన్న యూతే కాదు చిన్న పిల్లలు కూడా కళ్లద్దాలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారికి కళ్లద్దాలు రావొద్దంటే మాత్రం రోజూ వారికి కొన్ని ఫుడ్స్ ను మర్చిపోకుండా పెట్టండి. 
 

foods for kids

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు కూడా లావు లావు కళ్లద్దాలను వాడుతున్నారు. కారణం ఫోన్లను, ఎలక్ట్రానిక్ డివైజ్ లను విపరీతంగా వాడటం, దీనివల్ల చిన్న వయసులోనే పిల్లలు తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మొబైల్ లేకపోతే పిల్లల స్కూల్, ట్యూషన్, చదువులు అసాధ్యంగా మారాయి. ఈ ఫోన్ల వల్ల మీ పిల్లల కంటి చూపు తగ్గకూడదంటే వారికి కొన్ని ఆహారాలను ఖచ్చితంగా పెట్టాలి. ఇవి మీ పిల్లల కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే కంటిచూపును కూడా పెంచుతాయి. అవేంటంటే? 

carrot

క్యారెట్

కంటి చూపు బాగుండటానికి క్యారెట్ ను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు. ఈ క్యారెట్ లో విటమిన్లు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ పిల్లల కంటి చూపును పెంచడంతో పాటుగా వారి మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే వీటిని ఖచ్చితంగా రోజూ ఏదో ఒక రూపంలో వారి ఆహారంలో చేర్చండి.
 

Latest Videos


చిలగడ దుంప

కంటి చూపును పెంచడంలో చిలగడదుంప చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ, విటమిన్ సి లోపాన్ని తగ్గించి కళ్లజోడు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు కూడా వీటిని తినిపించండి.

ఆకుకూరలు

మీ పిల్లల కంటి చూపు చిన్న వయసులోనే బలహీనంగా ఉంటే.. వారికి రోజూ ఆకు కూరలను పెట్టండి. బచ్చలికూర, పాలకూర, మెంతి కూర మొదలైన వాటిని రోజూ పెట్టండి. ఆకు కూరలు మంచి పోషకాహారం. ఇది వారిలో ఎన్నో పోషక లోపాలను తగ్గిస్తుంది. 
 

capsicum


క్యాప్సికమ్

క్యాప్సికమ్ ను కూడా ఏదో ఒక రూపంలో మీ పిల్లల ఆహారంలో చేర్చండి. దీనిని కూరగా, లేదా సలాడ్ లో తినొచ్చు. ఈ కూరగాయ విటమిన్ సి కి మంచి మూలం.  ఇది కంటి చూపును పెంచుతుంది. కళ్లను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.

click me!