ప్రతి తల్లి తన కూతురితో ఇవి మాట్లాడాలి..

First Published | Feb 13, 2024, 1:06 PM IST

అమ్మే మన మొదటి గురువు. జీవితానికి సంబంధించిన ఎన్నో పాఠాలను తల్లిదండ్రులే మనకు నేర్పుతారు. కానీ ప్రతి తల్లి తన కూతురికి.. ముఖ్యంగా ఎదుగుతున్న వయసు కూతురికి కొన్ని విషయాల గురించి ఖచ్చితంగా చెప్పాలి. అవేంటంటే? 

parenting

బాల్యం నుంచి యుక్త వయస్సు వరకు.. జీవితంలోని ఎన్నో చిన్న, పెద్ద, పాత విషయాలను మన తల్లిదండ్రుల నుంచి.. ముఖ్యంగా మన అమ్మ నుంచే నేర్చుకుంటాం. ఎందుకంటే అమ్మే మన మొదటి గురువు. అయితే ఈ అభ్యసన, బోధనా ప్రక్రియ కేవలం బాల్యానికి మాత్రమే పరిమితం కాకూడదు. పిల్లల ఎదుగుదల, వయసుకు సంబంధించి చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంట్లో కూతురు ఉందంటే వయసు పెరిగే కొద్దీ వారిలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఇలాంటప్పుడు వారితో కొన్ని విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అప్పుడే మీ అమ్మాయికి జీవితంలో వచ్చే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం సులువు అవుతుంది. అందుకే ప్రతి తల్లి తన టీనేజ్ కూతురితో ఏ విషయాల గురించి మాట్లాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


శారీరక మార్పుల గురించి..

యుక్త వయస్సు రాగానే అమ్మాయిల శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి. వారి వక్షోజాలు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. దీని గురించి వారు బాగా కలత చెందుతుంటారు. అందుకే ఇలాంటి పరిస్థితిలో..  ఇవన్నీ సాధారణమైనవని వారికి వివరించడం మీ బాధ్యత. అలాగే పీరియడ్స్ కు సంబంధించిన సమస్యల గురించి కూడా ప్రతి తల్లి తన కూతురుకు చెప్పాలి. అలాగే శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా బట్టలు ఎలా వేసుకోవాలో కూడా చెప్పాలి. 
 


పోషణ

టీనేజ్ అమ్మాయిలకు సరైన పోషకాహారం చాలా చాలా అవసరం. అందుకే తల్లులు.. తమ కూతుర్లతో దీని గురించి కూడా మాట్లాడాలి. నిజానికి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తినాలనుకుంటారు. ఎందుకంటే ఇవి అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి. కానీ ఇవి ఆరోగ్యానికి మంచివి కావని తల్లులు చెప్పాలి. అలాగే శరీరానికి శరీరానికి ఏమి అవసరమో వారికి చెప్పంటి. టీనేజ్ లో మైక్రో, మాక్రో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కేలరీలు, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ ఈ వయస్సులో చాలా అవసరం.

మానసిక ఆరోగ్యం

ఈ వయస్సులో శారీరక మార్పులతో పాటుగా మానసిక సమస్యలు కూడా అమ్మాయిలను బాగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ప్రతి ముఖ్యమైన విషయాన్ని కూరుర్లతో తల్లులు చాలా ఓపెన్ గా మాట్లాడాలి. ఈ వయసులో చాలా మంది అమ్మాయిలు పీరియడ్స్, బ్రెస్ట్ మార్పులతో కలత చెందుతారు. అలాగే దాని గురించి ఎవరూ మాట్లాడనప్పుడు డిప్రెషన్, స్ట్రెస్ బారిన పడటం మొదలుపెడతారు. కాబట్టి ఇది సర్వ సాధారణమేనని తల్లులు చెప్పాలి. 
 

Latest Videos

click me!