1.చియా సీడ్స్..
ఈ రోజుల్లో అందరూ డైట్ విషయంలో హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బరువు తగ్గే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.దానిలో భాగంగానే తమ డైట్ లో చియా సీడ్స్ ని భాగం చేసుకుంటున్నారు. చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో మన ఆరోగ్యానికి అవసరం అయ్యే అన్ని పోషకాలు ఉన్నాయి. న్యూట్రియంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి భయటపడటానికి ఇవి సహాయపడతాయి. అందుకే.. వీటిని మీరు తినడమే కాకుండా.. పిల్లల డైట్ లోనూ భాగం చేయాలి. చియా వాటర్, చియా పుడ్డింగ్ లాంటి ఫుడ్స్ ని పిల్లలకు తినిపించాలి.