పేరెంట్స్ నోట ఈ మాటలు వింటే.. పిల్లల హార్ట్ బ్రేక్ అవ్వడం పక్కా...!

First Published Jun 20, 2024, 11:03 AM IST

వారి వయసు చిన్నది అయినా.. ఆ మాట వారి గుండెల్లో నాటుకు పోయి.. వారి హార్ట్ ని బ్రేక్ చేస్తుందట. మరి.. ఎలాంటి పదాలు వాడకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

parents

తమ కడుపున పుట్టిన పిల్లలపై ప్రేమ లేకుండా ఉండే పేరెంట్స్ ఎవరు ఉంటారు..? అందరికీ తమ పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ.. పిల్లలు అల్లరి చేసినప్పుడు, బాగా విసిగించినప్పుడు కోపంతో కొందరు పేరెంట్స్ నోరు జారతారు.  కోపంలో మనం ఏదో అనేస్తాం.. తర్వాత మళ్లీ పిల్లలతో సరిగానే ఉంటాం. కానీ.. ఆ మాట మాత్రం పిల్లలపై చిన్ని గుండెను గాయం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. మనకు ఎంత కోపం వచ్చినా... పిల్లల ముందు కొన్ని మాటలు అనకూడదు అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. వారి వయసు చిన్నది అయినా.. ఆ మాట వారి గుండెల్లో నాటుకు పోయి.. వారి హార్ట్ ని బ్రేక్ చేస్తుందట. మరి.. ఎలాంటి పదాలు వాడకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

parents


1.పిల్లలు వచ్చిన తర్వాత.. పేరెంట్స్ కి వాళ్లకంటూ స్పెషల్ గా టైమ్ దొరకదు. అంతకముందులా ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకి, ట్రిప్స్ కి వెళ్లలేరు. వాళ్లు వెళ్లే ప్రతి ప్లేస్ కీ.. పిల్లలను అనుమతించరు. పిల్లల కారణంగా తమ సంతోషాలకు ఆటంకం కలుగుతుంది అనుకున్నప్పుడు కొంత ఫ్రస్టేషన్ వస్తుంది. అయితే.. దానిని పిల్లల ముందు చూపించినప్పుడే.. వారి చిన్ని గుండె తట్టుకోలేదు. నీ వల్ల నాకంటూ టైమ్ లేకుండా పోతోంది, మా సంతోషానికి నువ్వు అడ్డుగా మారావు.. లాంటి మాటలు పిల్లలతో అనకండి.  మీరు కోరుకుంటున్న సంతోషం.. వారు కాస్త పెద్ద అయ్యాక అయినా దొరుకుతుంది. కానీ.. మీరు అన్న మాటలు మాత్రం.. వారి మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. 

Latest Videos


2.ఇక.. పిల్లలు..  కనిపించినవీ, నచ్చినవీ అన్నీ కావాలని కోరుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వెంటనే.. పేరెంట్స్ ని నాకు అది కావాలి అని అడుగుతూ ఉంటారు. అయితే.. కొందరు పేరెంట్స్.. పిల్లలు అడిగినప్పుడు..  కొనివ్వడం ఇష్టం లేక.. మనకు అంత స్థోమత లేదు.. మన దగ్గర అంత డబ్బు లేదు అని చెబుతూ ఉంటారు. వారి ఆర్థిక పరిస్థితి అలా ఉండి ఉండొచ్చు. కానీ... ఆ మాటలు కూడా పిల్లల మనసులో నాటుకుపోతాయి. వారిలో ఫైనాన్షియల్ ఇన్ సెక్యూరిటీ పెరిగిపోతుంది. దానికి బదులు.. ఇప్పుడు కాదు.. తర్వాత కొందాం, లేదంటే.. అలాంటి ఖర్చులు చేయకుండా.. సేవింగ్స్ చేయడం అవసరం  లాంటివి చెప్పడం బెటర్.

3.పెళ్లి తర్వాత వెంటనే పిల్లలు కావాలి అని కోరుకునేవారు కొందరు ఉంటే... కొంత కాలం తర్వాత పిల్లలు కందాం అని ప్లాన్ చేసుకునేవారు మరికొందరు ఉంటారు. కానీ.. కొన్నిసార్లు ప్లాన్ రివర్స్ అవుతుంది. వద్దు అనుకన్నవారికి వెంటనే పిల్లలు పుడుతూ ఉంటారు. అయితే... ఈ విషయాన్ని పిల్లల ముందు చెప్పకూడదు. మేము నిన్ను కావాలి అనుకోలేదు.. వద్దు అనుకున్నా కూడా పుట్టావ్ లాంటి మాటలు పొరపాటున కూడా పిల్లల ముందు అనొద్దు. ఈ మాటలు కూడా పిల్లలను చాలా బాధపెడతాయి.
 

4.ఇక పిల్లలు అందరూ అన్ని విషయాల్లో సూపర్ గా ఉండరు. కొన్నిసార్లు మనం అనుకున్నదాంట్లో వారు సక్సెస్ కాలేకపోవచ్చు. అలా అని.. నువ్వు ఎప్పుడూ ఇంతే.. మమ్మల్ని నిరుత్సాహ పరుస్తూనే ఉంటావ్ లాంటి మాటలు అనొద్దు. ఈ మాటలు.. పిల్లలను మరింత నిరుత్సాహపరుస్తాయి. ప్రోత్సహిస్తే.. మరోసారి అయినా విజయం సాధించగలరు. కానీ.. మీరు ఇలాంటి మాటలు అంటే..వారు మరింత డీలా పడే ప్రమాదం ఉంది.

5.పిల్లలలకు ఇతరులతో పోల్చడం నచ్చదు. అది తోడబుట్టిన వారు అయినా కూడా ఇష్టపడరు. మీరు ప్రతి నిమిషం తోడబుట్టిన వారితోనే, స్నేహితులతోనో పోలిస్తే.. వారి పట్ల పిల్లలకు ద్వేషం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. ఇలాంటి మాటలుు అనుకుండా ఉండటమే మంచిది. 

click me!