పిల్లలు రోజుకు ఎంతసేపు ఫోన్ చూడాలో తెలుసా?

First Published | Jun 21, 2024, 11:44 AM IST

మన జీవితంలో ఫోన్ ఒక భాగమైపోయింది. చిన్నలు, పెద్దలు అంటు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లకు బానిసలయ్యారు. ముఖ్యంగా పిల్లలు. కానీ పిల్లలు ఎక్కువ సేపు ఫోన్ ఉపయోగిస్తే మాత్రం వారి కంటిచూపు దెబ్బతినడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం కూడా ఉంది. 
 


ఫోన్ ను అవసరానికి వాడితే ఎలాంటి సమస్యలు రావు. కానీ చాలా మంది అవసరానికే కాకుండా టైం పాస్ కు కూడా వాడుతుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పెద్దలు ఫోన్ ను వాడటమే కాకుండా పిల్లలకు కూడా ఈ అలవాటు నేర్పుతున్నారు. పేరెంట్స్ పనులు చేసుకుంటుంటే ఎక్కుడ డిస్టర్బ్ చేస్తారో అని ఒక టచ్ ఫోన్ ను ఇచ్చి ఒకదగ్గర కూర్చోబెడుతున్నారు. ఈ ఫోన్ వల్ల పిల్లలు కూర్చున్న దగ్గర నుంచి ఇంచు కూడా కదలరు.

mobile phone

పెద్దలకే కాదు పిల్లలకు కూడా ఫోన్ వాడకం ప్రమాదకరం. ముఖ్యంగా చిన్న పిల్లలు గంటలకొద్దీ ఫోన్ ను చూస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏమీ అనకుండా ఉంటారు. ఎక్కడ ఫోన్ చూడకుండా ఉంటే వారిని డిస్టర్బ్ చేస్తారో అని. కానీ పిల్లలు గంటల కొద్దీ ఫోన్ చూస్తే వారికి శారీరక సమస్యలతో పాటుగా మానసిక సమస్యలు కూడా వస్తాయి. పిల్లలు అతిగా ఫోన్ చూడటం వల్ల వారికి తలనొప్పి, కంటి నొప్పి వంటి సమస్యలు వస్తాయి. 

Latest Videos


mobile phone


పిల్లలు ఫోన్ ను ఎంత సేపు చూడాలి? 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలు 2 గంటలకు మించి ఫోన్ ను అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది వారి కళ్లపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే వారి నిద్రను కూడా పాడు చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు రాత్రిపూట అస్సలు ఫోన్ ను ఉపయోగించకుండా తల్లిదండ్రులు చూడాలి. 
 

mobile phone children

స్క్రీన్ టైమ్ అంటే ఏమిటి?

ఒక్క ఫోన్లనే కాదు  పిల్లలు పిల్లలు టీవీ, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కూడా ఎక్కువగా ఉపయోగించకూడదు. ఎందుకంటే వీటిని చూడటం వల్ల పిల్లల కళ్లు ఎర్రబడతాయి. అలాగే వారి కళ్లు పొడిబారడంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా మీ పిల్లల కంటిచూపు కూడా తగ్గే అవకాశం ఉంది. 
 

kid using mobile phone


శారీరక శ్రమ

చిన్న పిల్లలు ఫోన్లు, ల్యాప్ టాప్ లను చూడటానికి బదులుగా.. స్కూల్ తర్వాత శారీరక శ్రమపై దృష్టి పెట్టేలా చూడండి. అంటే అవుట్ డోర్ గేమ్స్ ఆడమని చెప్పండి. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. చిన్నవయసు నుంచే పిల్లలు మొబైల్, ల్యాప్టాప్ వాడకుండా అడ్డుకుంటే వారికి ఎలాంటి ఇబ్బందులు రావు. 

click me!