సమ్మర్ హాలీడేస్ లో పిల్లల్ని ఎలా బిజీగా ఉంచాలి?

First Published | May 22, 2024, 2:46 PM IST

పిల్లలకు సమ్మర్ హాలీడేస్ అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఎందుకంటే ఈ హాలీడేస్ లో పుస్తకాలు పట్టాల్సిన, హడావుడిగా బడికి వెళ్లాల్సిన అవసరం ఉండనే ఉండదు. కానీ ఈ హాలీడేస్ తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారుతాయి. ఎందుకంటే పిల్లలు చెప్పిన మాట అస్సలు వినరు. కొంటె పనులు చేస్తుంటారు. వీళ్ల అల్లరిని ఎలా ఆపాలో తెలియక పేరెంట్స్ నెత్తి బాదుకుంటారు. కానీ కొన్ని చిట్కాలతో మీరు మీ పిల్లల్ని బిజీగా ఉంచొచ్చు. 

ఎండాకాలం సెలవులు పిల్లలకు ఇష్టంగా, పెద్దలకు కష్టంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పిల్లలు ఒక్కదగ్గర కుదురుగా ఉండరు. చెప్పిన మాట వినరు. కొంటెపనులు చూస్తూనే ఉంటారు. ఈ కొంటె పనులు చేయకుండా వేసవి సెలవుల్లో పిల్లలను బిజీగా ఉంచడానికి ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు అయోమయానికి గురవుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు బిజీగా ఉన్నప్పుడు ఫోన్ ఇచ్చో, టీవీ ఆన్ చేసి చూడమనో చెప్తుంటారు. కానీ ఇది మీ పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు.
 

మనసును ఫ్రెష్ గా ఉంచుకోవాలంటే కొంచెం ఎంటర్ టైన్ మెంట్ కూడా అవసరమే. కానీ పిల్లలు రోజంతా దీనిలో నిమగ్నమైతే అది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకుండానే వారికి విసుగు రాకుండా చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఈ సమ్మర్ హాలీడేస్ వారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇంతకీ పిల్లల్ని బిజీగా ఉంచడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


వంటగది పనిలో సహాయం..

ఈ సమ్మర్ హాలీడేస్ లో మీ పిల్లలకు వంటకు సాయం చేయడం నేర్పండి. అంటే కూరగాయలను తీయడం, వాటిని కడగడం, కట్ చేయడం, సలాడ్లు , శాండ్విచ్లను తయారు చేయడం వంటి చిన్న చిన్న పనులను నేర్పండి. అలాగే హెల్తీ ఫుడ్ గురించి అవి చేసే మేలు గురించి వివరించండి. అలాగే వంటతో పాటుగా పరిశుభ్రత గురించి కూడా చెప్పండి. దీనివల్ల మీ పిల్లలు చెడు ఆహారాలకు దూరంగా ఉంటారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు.

దినచర్య

వేసవి సెలవుల్లో బడికి వెళ్లాలనే టెన్షన్ ఏ మాత్రం ఉండదు. దీని వల్ల పిల్లలు హాయిగా లేట్ గా నిద్రపోతారు. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటారు. తింటుంటారు. అలాగే చదవడం, రాయడం మొత్తమే మానేస్తారు. కానీ ఇలా ఉంటే మీ పిల్లలు బద్దకస్తులుగా మారుతారు. అందుకే మీ పిల్లవాడు ఈ హాలీడేస్ ను సరిగ్గా ఉపయోగించుకోవాలనుకుంటే దాని కోసం వారి దినచర్యను రూపొందించండి. ప్రతిరోజూ కొన్ని పనులను సెట్ చేసుకోండి. వీటికి మీరు వెసులుబాటు కూడా ఇవ్వొచ్చు. కానీ వారు కొత్తదాన్ని నేర్చుకునేలా చేయడానికి ప్రయత్నించండి.
 

సృజనాత్మక అలవాటు

సెలవుల్లో చదువు తప్ప మరేదైనా హాబీ క్లాసులో చేరేలా చేయండి. అంటే డ్యాన్స్, సంగీతం, స్విమ్మింగ్, స్కేటింగ్, ఏదైనా క్రీడలపై ఆసక్తి ఉంటే మీ పిల్లల్ని దాంట్లో చేర్పించండి. ఏదేమైనా ఈ సమ్మర్ హాలీడేస్ ను మీ పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వారికి బోర్ కొట్టకుండా చూసుకోవాలి. అలాగే కొత్త కొత్త స్కిల్ డెవలప్ మెంట్. ఈ మూడు పై వాటి ద్వారా సాధ్యమవుతాయి. అందుకే ప్రతి తల్లిదండ్రులు ఈ పనులు చేయాలి.

click me!