పిల్లల్లో ఏకాగ్రతను పెంచే యోగాసనాలు ఇవి..!

First Published Feb 6, 2024, 2:01 PM IST

యోగాసనాలు చేయడం వల్ల .. పిల్లల్లో ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం వల్ల వారి చదువులకు కూడా ఉపయోగపడుతుంది. మరి అవేంటో ఓసారి చూద్దాం..
 

For strong arm and wrist try this yoga positions

యోగా ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే.  చాలా మంది యోగా పెద్దవాళ్లు. .. బరువు తగ్గడానికి చేస్తే చాలు అనుకుంటూ ఉంటారు. కానీ.. బరువుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ యోగా చేయవచ్చు. దీని వల్ల  శారీరకంగా, మానసికంగా  ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలు కూడా యోగాసానాలు వేయవచ్చు. ఈ కింది యోగాసనాలు చేయడం వల్ల .. పిల్లల్లో ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం వల్ల వారి చదువులకు కూడా ఉపయోగపడుతుంది. మరి అవేంటో ఓసారి చూద్దాం..

1.పద్మాసన( లోటస్ పోస్)

రెండు కాళ్లు క్రాస్ చేసి వేస్తారు ఈ పద్మాసనం. ఈ యోగాసనాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ.. దీని వల్ల పిల్లల్లో ఏకాగ్రత బాగా పెరుగుతుంది. మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. వెన్నముక బలంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది.  ఫోకస్ పెరిగేలా చేస్తుంది. కాబట్టి.. పిల్లలతో ప్రతిరోజూ ఈ యోగాసనం వేయించవచ్చు.

tadasana

2.తాడాసన.. ఈ ఆసనం కూడా.. పిల్లల్లో ఏకాగ్రత పెంచుకోవడానికి  ఉపయోగపడుతుంది. కొంత మంది పిల్లలు.. ఎత్తు పెరగడం లేదని చాలా మంది పిల్లలు ఫీలౌతూ ఉంటారు. కానీ... ఈ తాడాసన వల్ల పిల్లలు  ఎత్తు పెరగడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు.. పిల్లల్లో బ్యాలెన్స్ పెరగడానికి, మజిల్స్ బలపడటానికి,  ఫోకస్ పెరగడానికి సహాయపడుతుంది.

Bhramari Pranayama

3.భరమారి ప్రాణయామం..
ఈ ఆసనం చేయడానికి మీరు మొదట కంఫర్ట్ గా కూర్చోవాలి. తర్వాత.. మీరు రెండు బొటన వేళ్లతో  చెవులు మూసుకోవాలి. ఇప్పుడు  గాలి పీల్చుకొని.. గొంతుతో.. హమ్మింగ్ చేస్తూ...గాలి వదలాలి. ఇలా చేయడం వల్ల.. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

Vrikshasana

4.వృక్షాసన..
ఈ ఆసన కూడా ప్రతిరోజూ కచ్చితంగా పిల్లలతో  చేయించాలి. ఈ ఆసనం కూడా పిల్లల్లో ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుంది. ఈ వృక్షాసనం వల్ల.. పిల్లల్లో బ్యాలెన్స్, స్టెబిలిటీ, ఫోకస్ పెరుగుతుంది.
 

5.సూర్య నమస్కారం...

యోగాలో చాలా ముఖ్యమైనది ఈ సూర్య నమస్కారాలు. వీటిలో మొత్తం 12 ఉంటాయి. వీటిని ప్రతిరోజూ చేయడం వల్ల బాడీ మంచి షేప్ లో ఉంటుది. మొత్తం ఆరోగ్యం  మెరుగుపడటానికి సహాయపడుతుంది. అంతేకాదు.. మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి.. ఒత్తిడి తగ్గడానికి.. ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుంది.

click me!