పదేండ్ల పిల్లలకు ఈ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు? లేదంటే..?

First Published | Mar 19, 2024, 1:34 PM IST

ఎదుగుతున్న పిల్లలకు మంచి పోషకాహారాన్ని ఇవ్వాలి. అయితే చాలా మంది తల్లిదండ్రులు వాళ్లు తినేటివి కూడా పిల్లలకు పెడుతుంటారు. కానీ వీటివల్ల మీ పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. 

పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వారికి హెల్తీ ఫుడ్ ను పెట్టాలి. ఇది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత కూడా. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదగాలని ఏవేవో ఆహారాలు తినిపిస్తుంటారు. ఇక మరికొంతమంది తల్లిదండ్రులైతే పిల్లలకు ఇష్టమైన వాటిని పెడుతుంటారు. కానీ దీనివల్ల మీకు తెలియకుండానే మీ పిల్లల్ని వ్యాధుల బారిన పడేస్తున్నట్టే. అవును పిల్లలకు కొన్ని రకాల ఫుడ్స్ అస్సలు మంచివి కావు. సాధారణంగా పిల్లలకు ఆరు నెలల వయసు వచ్చిన తర్వాత నెమ్మదిగా తినిపించడం స్టార్ట్ చేయాలి. 

అలాగే మీ పిల్లల వయసును బట్టి వారికి తినిపించాలి. ముఖ్యంగా ఏ వయసు పిల్లలకు ఏవి తినిపించాలి? ఏవి తినిపించకూడదో ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పదేండ్ల పిల్లలకు కొన్ని ఆహారాలను పెట్టకూడదు. ఎందుకంటే ఇవి వారి ఆరోగ్యాన్ని, ఎదుగుదలను దెబ్బతీస్తాయి. అందుకే పదేండ్ల పిల్లలకు ఎలాంటి ఆహారాలను పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


processed meat

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసం చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈ మాంసం ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండేందుకు కొన్నిరసాయనాలను కలుపుతారు. అంతేకాదు వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్న పిల్లలకు  మూత్రపిండాల సమస్యలు వస్తాయి. అలాగే పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంది. అంతేకాకుండా ఇవి అరగడం కూడా కష్టమే. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే పదేండ్ల పిల్లలకు ప్రాసెస్ చేసిన ఆహారాలను అస్సలు తినిపించకూడదు. 

artificial-sweeteners

కృత్రిమ స్వీటెనర్లు 

అస్పర్టమే, సుక్రోలోజ్ వంటి కృత్రిమ స్వీటెనర్లు కూడా టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే ఇవన్నీ రసాయనాలతో తయారవుతాయి. ఈ రకమైన ఫుడ్ షాపుల్లో బాగా దొరుకుతుంది. కానీ ఈ ఫుడ్ పిల్లలకు మంచిది కాదు. మీ పిల్లలు ఇష్టంగా తినే జెలటిన్, ఐస్ క్రీం, మిఠాయిలలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఫుడ్స్ ను తినడం వల్ల పిల్లల మెదడు ఎదుగుదల మరింత క్షీణిస్తుంది.
 


సోడా

పెద్దలే కాదు పిల్లలకు కూడా సోడాను ఇష్టంగా తాగుతుంటారు. కానీ సోడా తాగితే పిల్లలకు డయాబెటీస్ వస్తుంది. అలాగే డయాబెటిస్ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. అలాగే ఈ సోడాలు దంతాల ఎనామెల్ ను నాశనం చేస్తుంది. దంత క్షయానికి కారణమవుతుంది. అంతేకాదు ఇవి పిల్లల గట్ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. 


ప్యాక్ చేసిన ఆహారాలు

ఊరగాయలు, ఉప్పు వేసిన చేపలు వంటి ఆహారాలు టిన్లలో ప్యాక్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే ఈ ఆహారాలలో ఎక్కువ మొత్తంలో రసాయనాలను, ఉప్పును కలుపుతారు. ఈ ఆహారాలు  ఫుడ్ పాయిజనింగ్ కు కూడా కారణమవుతాయి. ఈ ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల వీటిలో పోషకాలు అసలే ఉండవు. అందుకే ఈ ఆహారాలను పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. 

Latest Videos

click me!