పిల్లల్ని మందలించడం, ఇంట్లోనే ఉంచడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Mar 17, 2024, 12:49 PM IST

ఫాస్ట్ గా మారిపోతున్న జీవనశైలి ప్రభావం ఒక్క పెద్దలపైనే కాదు పిల్లలపై కూడా కనిపిస్తోంది. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు బలవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా డిప్రెషన్ బారిన పడుతున్నారు. అసలు పిల్లలు డిప్రెషన్ కు ఎందుకు గురవుతారో తెలుసా? 
 

kids

వేగంగా మారుతున్న జీవనశైలి మనల్ని ఎన్నో సమస్యల బారిన పడేస్తోంది. ముఖ్యంగా పెరిగిన పని ఒత్తిడి,  శారీరక, మానసిక సమస్యలతో జనాలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. పెద్దలే కాదు చిన్న పిల్లలకు కూడా డిప్రెషన్ బారిన పడుతున్నారు. గతకొంతకాలంగా పిల్లల్లో డిప్రెషన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయట.

kids

ఈ డిప్రెషన్ ను సకాలంలో నియంత్రించకపోతే సమస్య బాగా పెరుగుతుంది. ఇది అస్సలు మంచిది కాదు. మీ పిల్లలు దేనివల్ల డిప్రెషన్ బారిన పడుతున్నారో తెలుసుకుంటే  తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని రక్షించొచ్చు. అందుకే పిల్లలు దేనివల్ల డిప్రెషన్ బారిన పడతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


ఉమ్మడి కుటుంబం

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఉమ్మడి కుటుంబంలో తాత, నానమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మలు, చిన్నాన్నలు అంటూ ఎంతో మంది ఉంటారు. ఉమ్మడి కుటుంబంలో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. పిల్లలకు తల్లిదండ్రులతో పాటుగా తాతయ్యలు, మేనమామలు, అత్తమామలల, చిన్నమ్మలు, పెద్దమ్మల నుంచి ప్రేమ లభించింది. కానీ ఇప్పుడు చాలా మంది జంటలు వేరుగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. కానీ పనిచేసేవారు పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు. దీనివల్ల పిల్లలు ఒంటరిగా ఫీలవుతారు. దీనివల్ల వారు డిప్రెషన్ కు గురవుతారు. 
 

తిట్టడం

పిల్లలు అంటే తప్పు చేయకుండా ఉండలేరు. కానీ తప్పు చేసినందుకు ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టడమో, కొట్టడమో చేస్తూనే ఉంటారు. లేదా మందలిస్తుంటారు. కానీ తల్లిదండ్రులు ప్రతి సారీ ఇలాగే చేస్తే మీ ప్రవర్తన పిల్లల హృదయంలో ముల్లులా గుచ్చుకుంటుంది. దీని వల్ల వారి మనస్సు బాగా దెబ్బతింటుంది. దీనివల్ల మీ పిల్లలు క్రమంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. 
 


మాట్లాడకపోవడం 

ఉమ్మడి కుటుంబాల్లో నివసించే పిల్లలు తమ మనసులోని మాటలను చెప్పుకోవడానికి చాలా మంది ఉంటారు. తల్లిదండ్రులకు కాకపోయినా నానమ్మతాతకు లేదా పెద్దమ్మ పెదనాన్నకు, లేదా అత్తామామలకు చెప్పుకుంటారు. కానీ ప్రస్తుతం జాయింట్ ఫ్యామిలీలు లేవు కాబట్టి పిల్లలు ఒంటరి అయిపోతున్నారు. పనుల వల్ల తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటమే మానేశారు. దీనివల్ల పిల్లలకు ఎవ్వరితో మాట్లాడాలో తెలియక డిప్రెషన్ కు గురువుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

ఇళ్లలో బంధించడం..

ఒకప్పుడు పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి బయట ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగా లేకపోవడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు. దీనివల్ల పిల్లలు రోజంతా గాడ్జెట్లతోనే సమయాన్ని గడుపుతున్నారు. కానీ దీనివల్ల కూడా పిల్లలు డిప్రెషన్ బారిన పడుతున్నారు. 
 


పిల్లల్లో డిప్రెషన్ లక్షణాలు

అలసట
మూడ్ స్వింగ్స్ 
శక్తి తక్కువగా ఉండటం
నిద్ర సమస్యలు
ప్రతికూల ఆలోచనలు
ఎక్కువ లేదా తక్కువ తినడం
వినోద కార్యకలాపాల పట్ల ఆసక్తి లేకపోవడం

click me!