పిల్లలు ఎప్పుడూ సంతోషంగా పెరగాలంటే పేరెంట్స్ ఏం చేయాలి..?

First Published | Mar 18, 2024, 1:59 PM IST

ప్రతి విషయంలోనూ అండగా నిలవాలి. వారితో మనం ఒక ఆరోగ్యకరమైన బంధాన్ని ఏర్పాటు చేసకోవాలి. వీటితో పాటు.. ఇంకా ఏం చేస్తే.. పిల్లలు సంతోషంగా పెరుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం

ఇంట్లో పిల్లలు ఉంటే.. ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఈ విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలు లేని ఇల్లు చాలా బోసిగా ఉంటుంది. అదే పిల్లలు ఉంటే కలకలలాడుతూ ఉంటుంది. అయితే.. చాలా మంది పిల్లలు అల్లరి చేస్తున్నారనో, మాట వినడం లేదనో తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. దాని వల్ల పిల్లలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా.. పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నా, హ్యాపీగా పెరగాలన్నా.. పేరెంట్స్  ఏం చేయాలో ఓసారి చూద్దాం..

ప్రతి పేరెంట్స్ తమ పిల్లలు సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. దానికోసమే వారు కూడా కష్టపడుతూ ఉంటారు. నిజంగా పిల్లలు సంతోషంగా పెరగాలి అంటే... మనం వారికి అందుకుతగిన వాతావరణం కల్పించాలి. ప్రతి విషయంలోనూ అండగా నిలవాలి. వారితో మనం ఒక ఆరోగ్యకరమైన బంధాన్ని ఏర్పాటు చేసకోవాలి. వీటితో పాటు.. ఇంకా ఏం చేస్తే.. పిల్లలు సంతోషంగా పెరుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం

Latest Videos


పిల్లలకు లేవగానే ఉదయం పూట పేరెంట్స్ ప్రేమను పంచాలి. వారిని ప్రేమగా పిలుస్తూ నిద్రలేపాలి. నవ్వుకుంటూ వారికి ఎదురుపడాలి.అవసరమైతే  కౌగిలించుకొని, ఓ ముద్దు కూడా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల.. పిల్లల రోజు చాలా సంతోషంగా మొదలౌతుంది. వారు ఆ రోజంతా పాజిటివ్ గా ఉండగలుగుతారు.

పిల్లలు చేసే పనులను ఎంకరేజ్ చేయాలి. వారు మీరు చేసినంత పర్ఫెక్ట్ గా చేయలేకపోయినా.. వారు చేసే ప్రయత్నాన్ని మాత్రం మీరు గుర్తించాలి. మెచ్చుకోవాలి. అభినందించాలి. ఇంట్లోని కొన్ని చిన్న చిన్న పనులను వారితో చేయించి... వారు చేసినందుకు మెచ్చుకోవడం వల్ల.. వారు ఇంకోసారి ఆ పని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. సంతోషంగా ఆ పని చేస్తారు. చేసే పని పట్ల ఇష్టం కూడా పెరుగుతుంది.


పిల్లలు అన్నాక తప్పులు చేయడం సహజం. అయితే.. తప్పు చేశారు కదా అని వాళ్లను కొట్టడం, తిట్టడం చేయకూడదు. దానికి బదులు  వారు చేసిన తప్పును మనం కరెక్ట్ చేయాలి. ఎలా చేయాలి..? ఎలా చేయకూడదు అనే విషయం నేర్పించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు నేర్చుకుంటారు. మరోసారి తప్పు చేయకుండా ఉంటారు.  మరోసారి అలాంటి తప్పు చేయకుండా ఉంటారు.

పిల్లలు భోజనం చేసే సమయంలో వారు సంతోషంగా ఉండేలా చూడాలి. వారికి నచ్చిన ఆహారం వారికి  అందించాలి. ఇక.. పిల్లలు భోజనం చేసే సమయంలో.. వారితో పాటు మీరు కూడా ఉండాలి. మీరు ఆ సమయాన్ని వారికి మాత్రమే కేటాయించాలి.
 

పెద్దలకు నిద్ర ఎంత అవసరమో... పిల్లలకు కూడా అంతే అవసరం. ఈ విషయం ముందు పేరెంట్స్ తెలుసుకోవాలి. పిల్లలు నిద్రపోవడానికి వారి వయసుకు తగినంత నిద్ర ఇవ్వాలి. చదువులు, హోం వర్క్ లు అంటూ టెన్షన్ పెట్టకుండా, వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయించి.. ప్రశాంతంగా నిద్రపోయేలా సహకరించాలి.

పిల్లలు సంతోషంగా ఉండాలి అనుకుంటే సరిపోదు. అందుకోసం మనవంతు కృషి చేయాలి. పిల్లలు పరిసరాల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే భాషపై కూడా  దృషటి పెట్టాలి. పిల్లలపై అరవడం, ర్యాష్ లాంగ్వేజ్, బూతులు మాట్లాడటం లాంటివి చేయకూడదు. మనం మాట్లాడే మాటలే పిల్లలు కూడా నేర్చుకుంటారనే విషయం గుర్తంుచుకోవాలి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Parenting Tips

చాలా మంది తమ పిల్లలను ఇతరులతో పోలుస్తూ తక్కువ చేస్తూ ఉంటారు. కానీ.. పొరపాటున కూడా మీరు మీ పిల్లలను తక్కువ చేయకూడదు. ముఖ్యంగా అందరి ముందు పిల్లలను ఇన్ సల్ట్ చేయకూడదు. వాళ్లు పొరపాటున ఏదైనా తప్పు చేసినా మారు కరెక్ట్ ఛేయడానికి ప్రయత్నతించాలి. కానీ తక్కువ చేయకూడదు. వారి చిన్ని గుండెలు బాధపడతాయి.

Travel Tips


పిల్లలను స్కూల్ కి పంపేటప్పుడు మీరు వారిని కోపంగా పంపకూడదు. అలా పంపడం వల్ల  వాళ్లు ఆ కోపాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అలా కాకుండా.. మీరు నవ్వుతూ, వాళ్లను కూడా నవ్వుకుంటూ స్కూల్ కి పంపాలి.  అప్పుడు పిల్లల్లో పాజిటివిటీ పెరిగుతుంది. స్కూల్లో చెప్పింది కూడా చక్కగా నేర్చుకుంటారు.

click me!