Image: Getty
ప్రెగ్నెన్సీ ఆడవారి జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ. ఈ టైంను ప్రతి ఒక్క మహిళా ఎంతో ఆనందంగా గడుపుతుంది. కానీ ఈ సమయంలోనే వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి ప్రెగ్నెన్సీ సమయం అంత ఆహ్లాదంగా సాగదు. ఎందుకంటే ఈ సమయంలో వీరి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అయితే చాలా మంది ఆడవారు ఈ మార్పులను అస్సలు గమనించరు. ప్రతి గర్భిణీ.. ఈ సమయంలో ఎలాంటి లక్షణాలు సాధారణమో.. ఎలాంటివి కాంప్లికేటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ప్రెగ్నెన్సీ సాధారణ లక్షణాలు
గ్యాస్
వాంతులు
వికారం
తేలికపాటి నొప్పి
గుండెల్లో మంట
రాత్రిపూట వెన్నునొప్పి లేదా కాలి తిమ్మిరి
ముఖం, చేతులు, కాళ్లు, చీలమండలో వాపు
Image: Getty
ప్రెగ్నెన్సీ ఇతర సాధారణ లక్షణాలు
అయితే ప్రగ్నెన్సీ సమయంలో మీరు విస్మరించకూడని లక్షణాలు కూడా ఉన్నాయి. వీటిని లైట్ తీసుకుంటే మీరు ఎన్నో ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తరచుగా టాయిలెట్ కు వెళ్లడం, మీ చిగుళ్లు ఎర్రగా మారడం వంటి సమస్యలు వస్తే హాస్పటల్ కు వెళ్లండి. ఇది రక్తస్రావానికి దారితీస్తుంది. అలాగే మీ చర్మంలో ఎన్నో మార్పులు వస్తాయి. అంటే చర్మంపై గోధుమ రంగు మచ్చలు, స్ట్రెచ్ మార్కులు లేదా ముఖంపై వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలు వస్తాయి.
Image: Getty
గర్భధారణ సమయంలో సమస్యలు
ఏదేమైనా పై సాధారణ లక్షణాలతో పాటుగా గర్భధారణలో కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఇవి ప్రమాదకరమైన సమస్యకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. అలాంటి లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
stress during pregnancy
మీరు గర్భిణీ అయితే మీ దిగువ పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరి లేదా ఒక భుజం చివరన నొప్పి కలిగితే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. అలాగే మీ యోని నుంచి రక్తస్రావం అవుతున్నా, మీకు మైకంగా లేదా మూర్ఛగా అనిపించినా వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది.
అలాగే బిడ్డ గర్భం లోపల కదలడం ఆపివేస్తే కూడా ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లాలి. లేదా సాధారణం కంటే తక్కువగా కదిలినా లైట్ తీసుకోకూడదు. మీ కడుపునకు గాయం, తీవ్రమైన కడుపు నొప్పి వచ్చినా అస్సలు ఆలస్యం చేయకండి.