ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని తింటే లోపల బేబీ బాగా పెరుగుతుంది.. ఆరోగ్యంగా ఉంటుంది

First Published | Oct 3, 2023, 1:14 PM IST

గర్భిణులు ఫుడ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదల మీరు తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. 
 

Image: Getty

గర్భిణులకు పోషకాహారం చాలా చాలా అవసరం. ఎందుకంటే గర్భంలో బిడ్డ శారీరక ఎదుగుదల, ఆరోగ్యం బాగుండాలంటే మీరు ఖచ్చితంగా మంచి ఆహారాన్ని తినాలి. అందుకే మీరు తినే ఆహారంలో అన్నిరకాల పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ  టైంలో మీరు ఏం తిన్నా అది మీ బిడ్డను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ సమయంలో ఆహారం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఈ సమయంలో మీరు అన్ని రకాల పోషకాలను తీసుకోవాల్సి ఉంటుంది. బిడ్డ బాగా పెరిగేందుకు గర్భిణులు ఎలాంటి  ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

చిలగడదుంప

చిలగడదుంపలు మంచి పోషకాహారం. దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో వీళ్లకు విటమిన్ ఎ చాలా చాలా అవసరం. విటమిన్ ఎ బిడ్డ ఎదుగుదలకు అవసరం. చిలగడదుంపల్లో ఉండే బీటా కెరోటిన్ ను మన శరీరం విటమిన్ ఎగా మారుస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల పిల్లల ఎదుగుదల బాగుంటుంది.
 


సాల్మన్ 

గర్భిణులు కొన్ని రకాల చేపలను తినడం మంచిది కాదు. కానీ సాల్మాన్ ఫిష్ ను మాత్రం ఎలాంటి భయాలు లేకుండా తినొచ్చు. ఈ చేపలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గర్భధారణ కాలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే పిల్లల అభివృద్ధి కూడా బాగుంటుంది. 
 

Image: Freepik

కుంకుమ పువ్వు 

కుంకుమపువ్వుతో గర్భిణులకు బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గర్భిణుల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మార్నింగ్ సిక్ నెస్ ను కూడా తగ్గిస్తుంది. బిడ్డ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అందుకే గర్బిణులు కుంకుమ పువ్వును ఖచ్చితంగా తీసుకోవాలి. 

గుడ్డు 

గుడ్లలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్-బి12 లు పుష్కలంగా ఉంటాయి. గర్భిణులు గుడ్లను తినడం వల్ల కడుపులో పెరుగుతున్న పిల్లల మెదడు, వెన్నుపాము బాగా అభివృద్ధి చెందుతాయి. గుడ్లలోని ప్రోటీన్,  కాల్షియం మీ, మీ బిడ్డ ఎముకలను బలంగా ఉంచుతుంది. 
 

పెరుగు 

పెరుగు ప్రోబయోటిక్ ఫుడ్. ఇవి మీ గట్ కు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్. ఇది పిల్లల ఎముకలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆకుపచ్చ ఆకు కూరలు

ఆకుపచ్చ కూరగాయల్లో ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, పొటాషియంతో పాటుగా ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆకుపచ్చ కూరగాయలు మీ బిడ్డ తక్కువ బరువుతో పుట్టే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే మీ బిడ్డ బాగా ఎదిగేందుకు సహాయపడతాయి. 
 

బాదం 

బాదం పోషకాల బాంఢాగారం. దీనిలో ఎన్నో ఖనిజాలు, పొటాషియం, ఐరన్, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. బాదం మీకు అవసరమైన శక్తిని ఇస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఇ మీ పిల్లల మెదడు అభివృద్ధి చెందేందుకు సహాయపడుతుంది.

Latest Videos

click me!