ప్రెగ్నెన్సీ టైంలో చేపలను తినొచ్చా? తింటే ఎలాంటి చేపలను తినాలి? ఎలాంటివి తినకూడదు?

First Published | Sep 26, 2023, 1:09 PM IST

ప్రెగ్నెన్సీ టైం లో చాలా మంది చేపలను తినడానికి బాగా ఇష్టపడతారు. కానీ కొన్ని రకాల చేపలను గర్భిణులు అసలే తినకూడదు. ఇవి మీకే కాదు మీ బిడ్డకు కూడా హాని కలిగిస్తాయి. 
 

నాన్ వెజ్ ఫుడ్ ను తినేవారు ఎక్కువగా చేపలను తినడానికే ఇష్టపడతారు. నిజానికి ఇతర మాంసాహారాల కంటే చేపలే మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. చేపలు మన ఆరోగ్యానికే కాదు మన చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ప్రయోజకరంగా ఉంటాయి. అందుకే చాలా మంది చేపలను ఇష్టంగా తింటుంటారు. 

చేపలు ఎందుకు హానికరం?

ఆడవారు ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తమని తాము ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి.  ఫుడ్ నుంచి జీవన శైలి వరకు.. ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. గర్భిణులు ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఈ సమయంలో గర్భిణులు ఆహారం విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. కాగా ప్రెగ్నెన్సీ సమయంలో చేపలు తినడం సురక్షితమేనా? కాదా? అని కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 


fish

ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చేపలు తినొచ్చా?

చేపలలో పాదరసం ఉంటుందన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయితే వివిధ రకాల చేపలలో పాదరసం స్థాయిలు భిన్నంగా ఉంటాయి. అందుకే తక్కువ పాదరంస ఉన్న చేపలను తినడమే సేఫ్. అందుకే మీరు తినే చేపల గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. 
 

మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పూర్తిగా చేపలకు దూరంగా ఉండాలని కాదు. కానీ పాదరసం ఎక్కువగా ఉన్న చేపలను మాత్రమే తినడం మాత్రం మానుకోవాలి. మీరు ఈ సమయంలో సురక్షితంగా ఉండటానికి తక్కువ పాదరసం లేదా మీడియం పాదరసం చేపలను తినొచ్చు.

పాదరసం ఎక్కువగా ఉన్న చేపలు

పాదరసం శాతం ఎక్కువగా ఉండే చేపలను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తినాలి. కానీ గర్భిణులు మాత్రం వీటిని మర్చిపోయి కూడా తినకూడదు. అవేంటంటే.. ట్యూనా, సొర చేప, టైల్ ఫిష్, స్వోర్డ్ ఫిష్, కింగ్ మాకెరల్..
 

పాదరసం తక్కువగా ఉండే చేపలు 

తక్కువ పాదరసం స్థాయిలు ఉన్న చేపలను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. ఇవి సురక్షితంగా పరిగణించబడతాయి. అంతేకాకుండా గర్భిణులు, పిల్లలు వీటిని తినడం సురక్షితంగా భావిస్తారు. తక్కువ పాదరసం ఉన్న చేపలు ఇవే..  కోడ్,  సాల్మన్, సార్డినెస్,క్యాట్ ఫిష్, టిలాపియా, రొయ్యలు, స్కాల్ప్స్ , పీత మాంసాలు వంటి షెల్ఫిష్

మీడియం పాదరసం స్థాయి చేపలు:  గ్రూపర్, కార్ప్, Albacore tuna, ఎల్లోఫిన్ ట్యూనా,  అట్లాంటిక్ మహాసముద్రం టైల్ ఫిష్                                                                                                                                                                                                             

Latest Videos

click me!