గర్భిణీలు బ్రా ధరించాలా? ధరించకూడదా..?

First Published | Apr 29, 2024, 1:16 PM IST


నిజంగానే మహిళలు గర్భం దాల్చిన సమయంలో బ్రా ధరించకూడదా..? బ్రా ధరించకపోతే వచ్చే సమస్య ఏంటి..? దీని గురించి గైనకాలజిస్టులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం...
 


పెళ్లైన ప్రతి స్త్రీ తల్లి కావాలని అనుకుంటుంది. గర్భం దాల్చిన సమయంలో ఆ స్త్రీ పొందే ఆనందం అంతా ఇంతా కాదు. అయితే.. గర్భిణీ స్త్రీలకు శరీరంలో నెల నెలా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. శరీరంలో వచ్చే మార్పుల కారణంగా చాలా  డ్రెస్సింగ్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితిలో... ఎక్కువ మందికి బ్రా వేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.


నిజంగానే మహిళలు గర్భం దాల్చిన సమయంలో బ్రా ధరించకూడదా..? బ్రా ధరించకపోతే వచ్చే సమస్య ఏంటి..? దీని గురించి గైనకాలజిస్టులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం...

గర్భం దాల్చిన సమయంలోనూ  మహిళలు బ్రా ధరించాలట. కాస్త ఫ్రీగా ఉండేవి, కాటన్ వో, మీకు ఎలాంటి క్లాత్ అయితే కంఫర్ట్ గా ఉంటుందో చూసుకొని మరీ ధరించాలి. ఎందుకంటే  గర్భిణీగా ఉన్నప్పుడు రొమ్ము పరిమాణం రోజు రోజుకీ పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో.... బ్రా ధరించకపోతే.. రొమ్ము భాగం బాగా కుచించుకుపోయినట్లుగా, సాగిపోయినట్లు గా తయారౌతుంది. 
 



గర్భధారణ సమయంలో స్త్రీల రొమ్ములు చాలా సున్నితంగా మారతాయి. అటువంటి పరిస్థితిలో, బ్రా ధరించకపోవడం వారి సౌకర్యాన్ని తగ్గిస్తుంది. అదనంగా, రొమ్ముల సున్నితత్వం కూడా పెరుగుతుంది. దాని వల్ల మరింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.

బ్రా లేకుండా, రొమ్ములకు సరైన మద్దతు లభించదు, దాని కారణంగా అవి మరింత పెరుగుతాయి. దాని ఆకారాలు రూపులేనట్లుగా,   పనికిరానివిగా ఉంటాయి. అంతేకాదు.. భారీగా బరువు పెరిగినట్లుగా బరువుగా మరింత అసౌకర్యంగా ఉంటాయి.
 

బ్రా ధరించకపోవడం వల్ల రొమ్ముల కింద తడి, చెమటలు పట్టడం లేదా దురద వంటి సమస్యలు తలెత్తుతాయి, ఇది మీ రొమ్ముల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. క్రింద చర్మంలో కూడా సమస్యలు ఉండవచ్చు. తర్వాత పిల్లలకు పాలు ఇవ్వాలన్నా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రొమ్ము పరిమాణం పెరగడం.. బ్రా లేకపోవడంతో అవి కిందకు సాగినట్లుగా మారి.. మెడ, వెనక నొప్పి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అందుకే వీలైనంత వరకు బ్రా ధరించడానికే ప్రాధాన్యత ఇవ్వాలి.

Latest Videos

click me!