ఒక్క భారతదేశంలోనే పిల్లలు పుట్టినప్పటి నుంచి రెండు మూడేండ్లు వచ్చేంత వరకు కాటుక చుక్కను పెడుతుంటారు. కాటుకను కాళ్లకు, అరికాలికి, అరి చేయికి, బుక్కకు, ఎదమీద పెడుతుంటారు. ఎందుకంటే ఈ కాటుక చెడు కంటి నుంచి పిల్లల్ని రక్షిస్తుందని నమ్ముతారు. కానీ అసలు ఈ కాటుక పిల్లలకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అని మాత్రం తెలుసుకోరు. అసలు పిల్లలకు కాటుక పెడిగే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మార్కెట్ లో దొరికే కాటుకలో సీసం అను విషపదార్థం కలుస్తుంది. దీని పిల్లల నోటిలోకి వెళ్లి గాలి ద్వారా శ్వాసిస్తుంది. ఇది పిల్లల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును ఈ కాటుక వల్ల పిల్లల మూత్రపిండాలు దెబ్బతినొచ్చు. అలాగే వారి మెదడు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మూర్ఛ సమస్య కూడా వస్తుంది. ఈ అవయవాలపై ప్రభావం పడితే పిల్లల ఆరోగ్యంగా బాగా దెబ్బతింటుంది.
మీకు తెలుసా? కాటుకను పిల్లల కళ్లకు పెట్టడం వల్ల వారి కళ్లలోంచి నీరు కారుతుంది. అలాగే కళ్లు దురద పెట్టడం వల్ల అలెర్జీ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంట్లోనే సహజసిద్ధమైన పదార్థాలతో కాజల్ ను తయారు చేసినా కూడా అందులో కార్బన్ ఉంటుంది. ఈ కార్బన్ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
పిల్లల కళ్లకు కాటుక పెట్టడం వల్ల పిల్లల కళ్లు పెద్దగా మారుతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే పుట్టిన పిల్లలకు ప్రతిరోజూ కాటుకను పెడతారు. ఈ కాటుక వల్ల కంటిచూపు కూడా మెరుగుపడుతుందని నమ్మేవారు కూడా ఉన్నారు. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.