ఈ జనరేషన్ పిల్లలకు ఫర్ఫెక్ట్ గా సూటయ్యే పేర్లు ఇవి..!

Published : Mar 21, 2024, 01:40 PM IST

పిల్లల పేర్లు పెట్టేటప్పుడు అవి అందరూ పలికేలా సులభంగా ఉండేలా చూడాలి. అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. పిలవడానికి ఇష్టపడేలా ఉండాలి. 

PREV
110
ఈ జనరేషన్ పిల్లలకు ఫర్ఫెక్ట్ గా సూటయ్యే పేర్లు ఇవి..!
namkaran sanskar

ఈ కాలం పిల్లలకు పాత పేర్లు పెట్టడాన్ని ఎవరూ ఇష్టపడటం లేదు.  ఎక్కడ విన్నా కొత్త పేరే వినపడుతోంది. ప్రతి పేరెంట్స్ కూడా తమ పిల్లలకు అలా డిఫరెంట్ గా కొత్తగా పేర్లు పెట్టాలనే అనుకుంటారు. ఈ క్రమంలో కొందరైతే కనీసం అర్థం పర్థం లేకుండా పెట్టేస్తున్నారు.  మీరు కూడా మీ పిల్లలకు కొత్తగా.. డిఫరెంట్ గా మంచి అర్థం వచ్చేలా..  ఈ జనరేషన్ కి సూటయ్యేలా పేర్లు పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈ కింది పేర్లు ఒకసారి పరిశీలించండి.

210
baby name 01

పిల్లల పేర్లు పెట్టేటప్పుడు అవి అందరూ పలికేలా సులభంగా ఉండేలా చూడాలి. అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. పిలవడానికి ఇష్టపడేలా ఉండాలి. నోరు తిరగని పేర్లు పెడితే.. ఆ పేరును ఎవరికి నచ్చినట్లు వాళ్లు పిలిచేస్తారు. కాబట్టి.. అలా కాకుండా.. సింపుల్ గా ఉంటూ.. ఈ జనరేషన్ కి సూటయ్యే కొన్ని పేర్లు అర్థాలతో సహా చూద్దాం..
 

310
namkaran sanskar

1.జారా..
మీకు కనుక అమ్మాయి పుడితే.. ఈ పేరు పెట్టొచ్చు. పేరు చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ పేరు ఎంత కాలమైనా పాతపడదు. కొత్తగానే ఉంటుంది. జారా అంటే అందమైన పువ్వు, యువరాణి ( ప్రిన్సెస్) అని అర్థం.
 

410
Benefits of ear piercing to baby

2.అనైకా..
ఈ జనరేషన్ కి సరిగా సూటయ్యే మరో బేబీ గర్ల్ నేమ్ అనైకా. పేరు సింపుల్ గానూ ఉంటుంది. అందంగానూ ఉంటుంది. అనైకా అంటే... దయ, అందమైనది, అందమైన రూపం కలది అని అర్థం.
 

510
namkaran sanskar

3.హయత్..
ఇక.. అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు సూటయ్యే మంచి పేర్లు కూడా ఉన్నాయి. హయత్ అని ఈ జనరేషన్ అబ్బాయిలకు సరిగ్గా సూటయ్యే పేరు. హయత్ అంటే... జీవితం ( లైఫ్) అని అర్థం.
 

610
baby name 01


4.అలెక్స్..
ఈ పేరు కొంచెం విదేశీయులు పెట్టుకునే పేరులా అనిపిస్తుంది. కానీ... ఇక్కడి వారు కూడా పెట్టుకోవచ్చు. అబ్బాయిలకు సూట్ అవుతుంది.  అలెక్స్ అంటే.. రక్షించేవాడు అని అర్థం.

710
Baby

5.అల్ఫియా..
ముస్లిం మతానికి చెందిన అమ్మాయిలకు ఈ పేరు కరెక్ట్ గా సూటౌతుంది. అల్ఫియా అంటే.. స్వీట్  (తీపీ) అని అర్థం. ఈ పేరులాగే  ఆ అమ్మాయి కూడా చాలా తీయని మనసుతో ఉంటారని అర్థం.

810

6.ఇషాంక్..
ఈ జనరేషన్ లో అబ్బాయిలకు బాగా సూటయ్యే మరో పేరు ఇషాంక్. పేరు చాలా కొత్తగా ఉంటుంది. సింపుల్ గానూ ఉంటుంది. ఇషాంక్ అంటే గొప్ప, ఘనమైన, హిమాలయాలు అంతే ఎత్తైన అనే అర్థం వస్తుంది.

910
baby

7.త్రీదా..
ఈ పేరు ఈ జనరేషనల్ అమ్మాయిలకు సూట్ అవుతుంది. త్రీదా అంటే.. భూమి అని అర్థం.  మంచి అర్థం ఉంటుంది.. పేరు పిలవడానికి చాలా స్టైలిష్ గానూ ఉంటుంది.

1010

8.నిమిత్..
అబ్బాయిలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే మరో పేరు నిమిత్. నిమిత్ అంటే.. డెస్టినీ అని అర్థం. వీటిలో మీకు ఏవైనా పేర్లు నచ్చితే.. మీ పిల్లలకు పెట్టుకోవచ్చు.

click me!

Recommended Stories