పిల్లలు గోర్లు కొరకకూడదంటే ఏం చేయాలి?

First Published | Mar 20, 2024, 1:12 PM IST

పిల్లలు బొటన వేళును నోట్లో పెట్టుకోవడంతో పాటుగా గోర్లు కూడా కొరుకుతుంటారు. ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. అయితే తల్లిదండ్రులు కొన్ని పనులు చేస్తే పిల్లలు గోర్లు అస్సలు కొరకకు. 
 

పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ఒత్తిడికి గురైనప్పుడు లేదా విసుగు చెందినప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు కుతూహలం ఎక్కువగా ఉన్నప్పుడు గోర్లను తెగ కొరికేస్తుంటారు. ఇది వాళ్లకు  ఒక అలవాటు. న్యూరోపతి అని పిలువబడే ఈ రుగ్మత ఉన్నవారు ముక్కును వేలితో అటూ ఇటూ అనడం, జుట్టును తిప్పడం, పళ్లను కొరకడం వంటి పనులు చేస్తుంటారు. ఈ ఎంత కొట్టినా, తిట్టినా కానీ ఈ  అలవాటు మాత్రం మానుకోరు. 

ముఖ్యంగా పెద్దల కంటే పిల్లల్లో ఈ అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ దీన్ని చూసిన ప్రతి సారి ఈ అలవాటును మానుకోమని పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టడమో, తిట్టడమో చేస్తుంటారు. ఇలా చేసినంత మాత్రాన పిల్లలు అలవాటును మానుకోరు. కానీ గోర్లలో ఉండే మురికి కడుపులోకి వెళ్లి ఎన్నో రోగాలను కలిగిస్తుంది. అందుకే ఈ అలవాటున్న ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. దీన్ని మానుకోమని పిల్లల్ని కొట్టడం, తిట్టడం లాంటి పనులు అసలే చేయొద్దు. ఈ అలవాటును మానుకోవాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


గిఫ్ట్

మీ పిల్లలు గోర్లు కొరికే అలవాటును మానుకోవడానికి వారి దృష్టిని మరల్చండి. అలాగే మీరు గోర్లను ఇంత సేపు కొరకకపోతే మీకు గిఫ్ట్ ఇస్తామని చెప్పి చూడండి. పిల్లలకు గిఫ్ట్ అంటే చాలా ఇష్టం. కాబట్టి వారికి ఇష్టమైన వాటిని ఇప్పిస్తామని చెప్పి కూడా మీరు మీ పిల్లల్ని ఈ అలవాటుకు దూరం చేయొచ్చు. 

చెప్పడం

పిల్లలు గోర్లు కొరకడాన్ని చూసినప్పుడు తల్లులకు పట్టరాని కోపం రావొచ్చు. ఎన్నిసార్లు చెప్పినా వినరని చాలా మంది కొడుతుంటారు. కానీ మీ పిల్లలు గోర్లు కొరకడం చూసినప్పుడు వారిపై అరవడానికి బదులుగా కొరకకూడదని సంకేత భాషలో నో అంటే సైగ చేయండి. మీ ముఖంపై కోపాన్ని చూపిస్తూ వద్దని చెప్పండి. ముఖంలోని ఎక్స్ ప్రెషన్స్ తో బెదిరించండి.
 

దీనితో పాటుగా పిల్లల గోళ్లకు నెయిల్ పాలిష్ ను వేసినా కూడా పిల్లలు గోర్లను కొరకడం మానుకుంటారు. పెయింట్ వేసిన తర్వాత ఇది కడుపులోకి వెళ్తే సమస్యలొస్తాయని హెచ్చరించండి. ఇలాంటి పద్దతులను పాటిస్తే మీ పిల్లలు గోర్లను కొరికే అలవాటును మానుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Latest Videos

click me!