మీ పిల్లల్ని స్మార్ట్ గా, కాన్ఫిడెంట్ గా తయారుచేయాలంటే తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఇదే..!

First Published | Mar 16, 2024, 11:47 AM IST

పిల్లల సరైన ఎదుగుదలకు తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా ఉండాలి. మీ పెంపకమే వారు ఎదగడానికి, ఆత్మవిశ్వాసంతో ఉండటానికి సహాయపడుతుంది. మరి పిల్లల్ని స్మార్ట్ గా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిందేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు జీవితంలో ఎన్ని సమస్యలొచ్చినా ముందుగా సాగిపోతూనే ఉంటారు. జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. అయితే పిల్లల ఎదుగుదల అనేది వారి తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుంది. మనల్ని మనం మంచి రోల్ మోడల్స్ గా మార్చుకోవడం వల్ల మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అలాగే ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. ఇది వారి  బంగారు భవిష్యత్తుకు సహాయపడటమే కాకుండా పిల్లల్ని స్మార్ట్ గా తయారుచేస్తుంది. 
 

కొంతమంది పిల్లలు ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతుంటారు. అంటే వాళ్లు ఏ పనీ చేయలేరు. దీనికి ఇంటి వాతావరణమే కారణమని అనుకుంటారు. నిజానికి ఇంటి వాతావరణం కూడా పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఇంట్లో ఎప్పుడూ  నవ్వులు, సంతోషాలతో ఉండాలని నిపుణులుచెబుతున్నారు. అలాగే మీ పిల్లలు చేసే పనిని ప్రోత్సహించాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి వారిలో ఆత్మవిశ్వాసం నింపాలి. అందుకే మీ పిల్లలు స్మార్ట్ గా, ఆత్మవిశ్వాసంతో ఉండటానికి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


సానుకూలంగా ఉండండి

మనం ఎలాంటి విజయం సాధించినా దాని వెనుక మన పాజిటివిటీ ఉంటుంది. అందుకే మీ పిల్లలను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండేలా ప్రేరేపించండి.  అలాగే వారి పాజిటీవ్ పనులు విఫలమైనప్పటికీ వారిని ఎంకరేజ్ చేయండి. ఓటమి, విజయం జీవితంలో ఒక భాగం మాత్రమేనని వారికి అర్థమయ్యేలా చెప్పండి. అలాగే గెలుపు ఓటముల నుంచి నేర్చుకోవాలని చెప్పండి.
 

పిల్లల ఆలోచనలను అర్థం చేసుకోవడం

పిల్లలను అర్థం చేసుకోవడం చాలా కష్టమంటారు చాలా మంది. కానీ ఇది తల్లిదండ్రులకు చాలా సులువైన పని. పిల్లలతో మీరు రోజూ మాట్లాడితే.. వారిని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తే పిల్లలు తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని చెప్తారు. మీ పిల్లలు స్మార్ట్ గా మారాలన్నా, జీవితంలో మంచి పొజీషన్ కు ఎదగాలన్నా మీరు మీ పిల్లల ఆలోచనలు, శక్తులను అర్థం చేసుకోవాలి. 
 

దేవుడు అంటే ఏంటో చెప్పండి

పిల్లలు తమ జీవిత విలువలను అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకునేలా చేసే సామర్థ్యాన్ని పెంపొందించడానికి ముందుగా మీరు దేవుడు అంటే ఏంటో వారికి చెప్పండి. దేవుని శక్తిని, ఆయనపై విశ్వాస స్ఫూర్తిని మేల్కొల్పండి.
 

ఆధ్యాత్మికత 

పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మరింత  స్థితిస్థాపకంగా ఉంచడానికి వారికి ఆధ్యాత్మిక వికాసం చాలా అవసరం. ఇది పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇది మంచి, తప్పుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది వారిలో నిర్ణయం తీసుకునే శక్తిని కూడా పెంపొందిస్తుంది.
 

పిల్లలకు తమ వంతు కృషి చేయాలని చెప్పండి. వారు చేసే ప్రతి పనిలో బెస్ట్ ఇవ్వమని ప్రోత్సహించండి. విజయం సాధిస్తారో? లేదో? పక్కన పెట్టి ముందు ప్రయత్నం చేయమని చెప్పండి. అలాగే మీరు ఏం చేసినా విజయం దిశగా వెళ్లమని ప్రోత్సహించండి. 
 

ధ్యానం, అభ్యాసం 

ఏదైనా పనిపై దృష్టి పెట్టడం, విజయం కోసం సాధన చేయడం వల్ల పిల్లల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ఇది నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అందుకే పిల్లలకు అభ్యాసం అలవాటు చేయండి. ప్రతిరోజూ వారితో ధ్యానం చేయించండి.

Latest Videos

click me!