పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే పేరెంట్స్ ఏం చేయాలో తెలుసా?

First Published | Sep 12, 2024, 10:12 AM IST

ఎంత కష్టపడి.. హెల్దీ ఫుడ్స్ అలవాటు చేయాలి అనుకున్నా కూడా జంక్ వైపు ఎట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి, అలాంటి పిల్లలను ఎలా లైన్ లో పెట్టాలి..? వారిని ఎలా మంచి అలవాట్లు నేర్పించాలి..? దీని కోసం పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...

ప్రతి పేరెంట్స్.. తమ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలనే అనుకుంటారు. మంచి, ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పించడం వల్ల.. వారి  భవిష్యత్తు కూడా ఆరోగ్యంగా, శ్రేయస్సు కరంగా ఉంటుంది. ఈ మంచి అలవాట్లు పిల్లలకు నేర్పించే బాధ్యత పేరెంట్స్ మీదే ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవడం దగ్గర నుంచి.. చిన్నప్పటి నుంచే బాడీని ఫిట్ గా ఉంచుకునేలా వ్యాయామాలు చేయడం వరకు అన్నీ వారి రెగ్యులర్ రొటీన్ లో పేరేంట్స్ చేర్పించాల్సి ఉంటుంది.  అయితే.. చాలా సార్లు.. చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లలకు ఈ హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేయాలని చూసినా వారు తొందరగా నేర్చుకోరు.  ఎంత కష్టపడి.. హెల్దీ ఫుడ్స్ అలవాటు చేయాలి అనుకున్నా కూడా జంక్ వైపు ఎట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి, అలాంటి పిల్లలను ఎలా లైన్ లో పెట్టాలి..? వారిని ఎలా మంచి అలవాట్లు నేర్పించాలి..? దీని కోసం పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...

ఒక వయసు వచ్చిన తర్వాత.. మనం పిల్లలకు ఏదైనా నేర్పించాలి అంటే కష్టం కావచ్చు. కొంచెం పెద్దగా అయిన తర్వాత పిల్లలను పేరెంట్స్ మాట వినడం కంటే.. తమ ప్రయార్టీలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇష్టం లేని పని చేయిస్తున్నారని అయిష్టం చూపించే అవకాశం ఉంది. అలా కాకుండా... వారికి ఊహ రాకముందు నుంచే.. వారి డైలీ రొటీన్ లో చేర్పించాలి.
 

బాల్యంలో ఆరోగ్యకరమైన అలవాట్లను ఏర్పరచుకోవడం జీవితకాల శారీరక, మానసిక  శ్రేయస్సుకు సహాయపడుతుంది.  పిల్లలు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవడానికి పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకుందాం..

Latest Videos


1. బ్యాలెన్స్డ్ డైట్..
చిన్నప్పటి నుంచి.. అన్ని రకాల ఫుడ్స్ పిల్లలు తినేలా చూసుకోవాలి. దాని కోసం వారికి 8, 9 నెలల వయసు దగ్గరి నుంచే... అన్ని పోషకాలు ఉన్న ఫుడ్స్ ని.. పరిచయం చేయాలి. పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందుకోవడానికి పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు , తృణధాన్యాలపై దృష్టి పెట్టండి. ముందు నుంచి.... వారికి జంక్ ఫుడ్ అలవాటు చేయవద్దు. అవసరం అయితే.. పేరెంట్స్ కూడా వాటికి దూరంగా ఉండాలి. పిల్లల కోసం వాటిని పేరెంట్స్ మానేయడంలో ఎలాంటి తప్పు లేదు. అంతేకాదు.. పంచదార ఉండే ఫుడ్స్, కూల్  డ్రింక్స్ లాంటివి కూడా వారికి దూరంగా ఉంచాలి. 
 

2.కొంచెం అయినా.. శారీరక శ్రమ..
పిల్లల శారీరక , మానసిక ఆరోగ్యానికి శారీరక శ్రమ కీలకం. క్రీడలు, బహిరంగ ఆటలు లేదా హైకింగ్ లేదా బైకింగ్ వంటి కుటుంబ కార్యకలాపాల ద్వారా రోజువారీ కదలికలను ప్రోత్సహించండి. ప్రతి రోజు కనీసం 60 నిమిషాల కార్యాచరణను లక్ష్యంగా పెట్టుకోండి. ముందుగా 30 నిమిషాలతో  మొదలుపెట్టి దానిని 60 నిమిషాలకు పొడిగించాలి. వారిని అలా ఉత్సాహపరిచేందుకు మీరు కూడా వారితో కలిసి వ్యాయామాలు చేయడం లాంటివి చేయాలి. అప్పుడు మిమ్మల్ని చూసి వారు కూడా ఉత్సాహం చూపిస్తారు.

3.మించి నిద్ర..
పిల్లలు.. ఆరోగ్యంగా ఎదిగేందుకు మంచి నిద్ర చాలా అవసరం. మనం వారికి ఎంత మంచి ఆహారం ఇచ్చినా, వ్యాయమాలు చేయించినా.. సరిపడా నిద్ర లేకపోతే.. ఆరోగ్యం లభించదు. అందుకే.. కనీసం 9 గంటల నిద్ర వారికి అందేలా చేయాలి. దాని కోసం.. రోజూ ఒకే సమయానికి వారు నిద్రపోయేలా ఎంకేరేజ్ చేయాలి.


4. మోడల్ ఆరోగ్యకరమైన అలవాట్లు
పిల్లలు తమ తల్లిదండ్రులను గమనించి నేర్చుకుంటారు. ఆరోగ్యంగా తినడం, చురుకుగా ఉండటం , ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా సానుకూల రోల్ మోడల్‌గా ఉండండి. తల్లిదండ్రులు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, పిల్లలు ఆ ప్రవర్తనలను స్వీకరించే అవకాశం ఉంది.

5. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి
సాంకేతికత రోజువారీ జీవితంలో ఒక భాగమైనప్పటికీ, అధిక స్క్రీన్ సమయం పిల్లల శారీరక , మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. స్క్రీన్ సమయంపై పరిమితులను సెట్ చేయండి. చదవడం, ఆడటం లేదా సృజనాత్మక అభిరుచులు వంటి ప్రత్యామ్నాయ కార్యకలాపాలను ప్రోత్సహించండి. స్క్రీన్ సమయానికి తగ్గించడానికి వారికి ఆకర్షించేలా వేరే గేమ్స్ ఆడించాలి.

click me!