Parenting Tips for Boys: మంచి మనిషిగా ఎదగాలంటే చిన్నప్పటి పెంపకం చాలా కీలకం. అదే ఫ్యూచర్ కు పునాది. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారి ఫ్యూచర్ సఫర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ 5 తప్పులు అస్సలు చేయకండి
పిల్లల పెంపకం ప్రతి తల్లిదండ్రికి పెద్ద బాధ్యత. ముఖ్యంగా కొడుకులను పెంచే విషయంలో కొన్ని చిన్న తప్పులు కూడా వారి భవిష్యత్తు వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. చిన్నప్పటి నుంచి సరైన విలువలు నేర్పితేనే వారు బాధ్యతాయుతమైన, గౌరవంగా ప్రవర్తించే వ్యక్తులుగా ఎదుగుతారు. అయితే కొడుకు పెంపకంలో తల్లిదండ్రులు తప్పక నివారించాల్సిన కొన్ని ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి.
26
అహంకారపు భావన (Over Entitlement)
కొడుకు కాబట్టి అతనికి అన్నీ ప్రత్యేకంగా ఉండాలనే భావనను పెంచడం మంచిది కాదు. ఇలా పెంచితే పిల్లల్లో అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది. జీవితంలో ప్రతి విషయాన్ని కష్టపడి సాధించాల్సిందే అనే విషయాన్ని వారికి చిన్నప్పటి నుంచే చెప్పాలి.
36
మహిళల పట్ల గౌరవం లేకపోవడం (disrespecting women)
కొడుకులకు చిన్నప్పటి నుంచే మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించడం నేర్పాలి. కుటుంబంలో తల్లి, అక్క, చెల్లి వంటి వారి పట్ల గౌరవం ఎలా చూపాలో చూపించాలి. ఇదే విలువలు సమాజంలో కూడా వారికి ఉపయోగపడతాయి.
తిరస్కారాన్ని అంగీకరించలేకపోవడం(Inability to Accept Rejection)
జీవితంలో ప్రతి విషయం మన అనుకున్నట్లే జరగదు. కొన్నిసార్లు ఓటమి లేదా తిరస్కారం ఎదురవుతుంది. అప్పుడు ఎలా స్పందించాలో పిల్లలకు నేర్పడం చాలా ముఖ్యం. ఓటమిని అంగీకరించి మళ్లీ ప్రయత్నించడం నేర్చుకుంటేనే వారు మానసికంగా బలంగా మారుతారు.
56
బాధ్యతలు ఇవ్వకపోవడం(avoiding responsibility)
అబ్బాయిలకు చిన్న చిన్న పనులు ఇవ్వాలి, బాధ్యతలు అప్పగించడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే వారిలో బాధ్యతా భావం పెరుగుతుంది. ఇంటి పనుల్లో సాయంగా ఉంటే వారికి జీవితంలో ఉపయోగపడుతుంది. అది వారికి ఎక్కడికి వెళ్లినా బతికే ఆత్మవిశ్వాసం ఇస్తుంది.
అబ్బాయిలు ఏడవకూడదు, భయం ఉండకూడదు అనే భావన చాలా చోట్ల ఉంటుంది. కానీ ఇది సరైనది కాదు. ఫీలింగ్స్ చెప్పడం కూడా ఒక హెల్దీ అలవాటు. తల్లిదండ్రులు పిల్లలకు తమ భావాలను స్పష్టంగా చెప్పేలా ప్రోత్సహించాలి.
సరైన విలువలు, గౌరవం, బాధ్యత వంటి లక్షణాలను చిన్నప్పటి నుంచే నేర్పితేనే అబ్బాయిలు లైఫ్ లో ఎదగ్గలరు. తల్లిదండ్రుల మార్గదర్శకత్వం వల్లే ఫ్యూచర్ కు ఎలాంటి కష్టాన్నైనా, సమస్యనైనా ఎదుర్కోగలరు.