తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పాల్సిన పవర్ ఫుల్ విషయాలు ఇవి...!

First Published | Jun 19, 2024, 1:02 PM IST

ఏది ఏమైనా.. మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం అనే విషయాన్ని పేరెంట్స్ రోజూ చెప్పాలి. ఈ మాట వారికి కొండంత ధైర్యాన్ని అందిస్తుంది. పిల్లలు స్ట్రాంగ్ మైండెడ్ గా ఉంటారు.

ప్రతి పేరెంట్స్  తమ పిల్లలను ఉన్నతంగానే పెంచాలి అనుకుంటారు. కానీ.. పిల్లలను పెంచడం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. పిల్లలు అంత తొందరగా చెప్పింది వినరు. మనం చెప్పగా చెప్పగా.. వారికి ఏదైనా విషయం అర్థమౌతుంది. అందుకే... పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే.. కొన్ని మాటలు మనం పిల్లలలకు రోజూ చెబుతూ ఉండాలట. అవేంటో ఓసారి చూద్దాం...
 

పిల్లలు తమ పేరెంట్స్ నుంచి గిఫ్ట్స్, టాయ్స్ కంటే కూడా ప్రేమను ఎక్కువగా కోరుకుంటారు. వారికి మీరు ఏం ఇచ్చినా ఇవ్వకున్నా.. అవధులు లేని ప్రేమ కురిపించాలి. ఇదే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా పేరెంట్స్ చేయాలి. ఏది ఏమైనా.. మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం అనే విషయాన్ని పేరెంట్స్ రోజూ చెప్పాలి. ఈ మాట వారికి కొండంత ధైర్యాన్ని అందిస్తుంది. పిల్లలు స్ట్రాంగ్ మైండెడ్ గా ఉంటారు.
 


పిల్లలు తమ పేరెంట్స్ నుంచి మోటివేషన్ కోరుకుంటారు. పిల్లలు తప్పు చేశారని.. వారిపై నమ్మకం లేకుండా మాట్లాడకూడదు. పిల్లలపై నమ్మకంతో ఉండాలి. వాళ్లను మీరు నమ్ముతున్నారు అనే విషయాన్ని మీరు వారికి చెప్పాలి. అప్పుడే... వారు మీతో నిజాయితీగా ఉండాటనికి ప్రయత్నిస్తారు. తమకు తాముగా బెస్ట్ ఉండటానికి ప్రయత్నిస్తారు.

పిల్లలు తప్పులు చేస్తారు. ఇది  చాలా సహజం. అయితే... పిల్లలు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు ఎక్కువగా శిక్షించకూడదు. అది కూడా నేర్చుకునే క్రమంలో చేసే తప్పులను వదిలేయాలి. తప్పులు చేసినా పర్లేదు.. నేర్చుకోమని   చెప్పాలి. అప్పుడు పిల్లలు ఆ తప్పులకు భయపడకుండా.. నేర్చుకోవడం పై దృష్టి పెడతారు. ఏదైనా చేయడం రాకపోయినా.. మళ్లీ మళ్లీ చేయమని ఎంకరేజ్ చేయాలి.
 


పిల్లలు కూడా తమ పేరెంట్స్ ని హ్యాపీగా చూడాలి అనుకుంటారు. వాళ్లను గర్వపడేలా చేయాలని ఆరాటపడతారు. అలాంటి క్రమంలో వాళ్లు ఫెయిల్ అయినా.. మీరు వారిని ఏమీ అనకూడదు. ఓడిపోయినా.. తమ పిల్లలను చూసి తాము గర్వపడుతుంటాం అనే విషయాన్ని వారికి చెప్పాలి. అప్పుడు వారిలో మోటివేషన్ వస్తుంది.

parents

పిల్లల ఆలోచనలు.. మనకు పంచుకునేలా ఎంకరేజ్ చేయాలి. ఈ విషయం గురించి నువ్వు ఏమి ఆలోచిస్తున్నావ్ అని అడిగి తెలుసుకోవాలి. వారి ఆలోచనలు మనతో పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.  అప్పుడే..వాళ్లు కూడా.. పేరెంట్స్ తో ఏదైనా పంచుకోవచ్చు అని తెలుసుకుంటారు. పేరెంట్స్ పట్ల గౌరవం కూడా పెరుగుతుంది.

పిల్లలు కొన్నిసార్లు.. ఏదైనా సహాయం కావాలని అడగడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే.. వాళ్లని అడిగి తెలుసుకోవాలి.  నీకు ఏదైనా సహాయం కావాలా..? అని అడగాలి. వాళ్లను ఒంటరిగా ఉండనివ్వకుండా.. ఎలాంటి సమస్యలు వచ్చినా.. పరిష్కరించే సమయంలో తాము తోడుగా ఉంటామనే ధైర్యాన్ని ఇవ్వాలి. 
 

Latest Videos

click me!