కొత్తవాళ్లను కలవడానికి పిల్లలు ఇబ్బంది పడుతున్నారా..? కారణం ఇదే కావచ్చు..!

First Published | Jun 18, 2024, 3:32 PM IST

 కొత్తవారిని చూసినప్పుడు పిల్లల్లో తెలియని ఓ భయం ఉంటుంది. ఇలా పిల్లలు భయపడటానికి కారణాలు ఉంటాయట. అవేంటో చూద్దాం....

ప్రతి పిల్లవాడికి తనదంటూ స్పెషల్ వరల్డ్ ఉంటుంది. ఏ ఒక్క పిల్లవాడు ఇంకొకరిలా ఉండడు.  కొందరు.. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా, కొత్తవారు వచ్చినా వెంటనే వెళ్లి మాట్లాడేస్తూ ఉంటారు. కానీ.. కొందరు మాత్రం కనీసం.. వాళ్లతో మాట్లాడటం కాదు కదా.. గదిలో నుంచి బయటకు కూడా రారు. మనం ఎంత బలవంత పెట్టినా బయటకు రావడానికి ఇష్టపడరు. వచ్చినా.. మాట్లాడరు. ఇబ్బంది పడుతూ ఉంటారు.  కొత్తవారిని చూసినప్పుడు పిల్లల్లో తెలియని ఓ భయం ఉంటుంది. ఇలా పిల్లలు భయపడటానికి కారణాలు ఉంటాయట. అవేంటో చూద్దాం....

కొందరు పిల్లలు కొత్తవారికి మాత్రమే కాదు.. అప్పుడప్పుడు ఇంటికి వచ్చే బంధువులతోనూ సరిగా మాట్లాడరు. భయపడుతూ ఉంటారు. అయితే..   నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లవాడు సాధారణంగా ఆందోళనగా, అసౌకర్యంగా లేదా భయపడినప్పుడు మాత్రమే బంధువులను సంప్రదించడానికి వెనుకాడతారట. పిల్లలు కంఫర్ట్ గా అయ్యి.. వారితో మాట్లాడటానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు. ఆ స్పేస్ మనం వారికి ఇవ్వాల్సి ఉంటుంది.


fear


బంధువులతో పరిచయం లేకపోవటం వల్ల అపరిచితులతో ఎలా కనెక్ట్ అవ్వాలో, ఏం మాట్లాడాలో పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ సమయంలో పిల్లల మదిలో ఎన్నో ప్రశ్నలు మెదులుతాయి. వీటిలో బంధువులకు కోపం వస్తుందా.. ఏదైనా పని చేయనిస్తారా.. తదితర ప్రశ్నలు వారి మదిలో మెదులుతూనే ఉన్నాయి. అందుకే.. పిల్లలు బంధువుల నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 

kids

కొన్ని సార్లు పిల్లలు.. గతంలో జరిగిన వాటికి కూడా భయపడే అవకాశం ఉంటుంది.  గతంలోని చేదు లేదా అసౌకర్య అనుభవాలు కూడా పిల్లలను బంధువుల నుండి దూరం చేయగలవు. ఉదాహరణకు, ఎవరైనా పిల్లవాడిని అరుస్తూ లేదా కొట్టినట్లయితే, పిల్లలు వారి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. 


ఇక కొందరు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలను ప్రశ్నలతో సతాయిస్తారు. ముఖ్యంగా చదువు గురించి ప్రశ్నలు వేస్తారు. అలాంటప్పుడు సమాధానం చెప్పకపోతే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తారు. దీని వల్ల పిల్లలు కూడా తల్లిదండ్రుల చేతుల్లో తిట్లు తినాల్సి వస్తుంది.  ఈ విధంగా, పిల్లలు వారి బంధువులను ఎదుర్కోకపోవడానికి ఒక కారణం కావచ్చు.


మరి పిల్లలు  ఆ భయం నుంచి భయటపడి.. వచ్చినవారితో కంఫర్ట్ గా  ఉండాలంటే ఏం చేయాలంటే.. వాళ్లను కలవడానికి పిల్లలు ఎందుకు భయపడుతున్నారో అడిగి తెలుసుకోవాలి.అటువంటి పరిస్థితిలో, పిల్లవాడిని తిట్టడం, బలవంతం చేయడం, బెదిరించడం లేదా కోపం తెచ్చుకోవడం బదులు, సమస్య ఏమిటని సున్నితంగా అడగండి. అతని మనస్సులో బంధువుల గురించి ఇప్పటికే తప్పుడు భావన ఉండే అవకాశం ఉంది. ఇది తెలుసుకున్న తర్వాత.. ఆ భయం తొలగించడానికి ప్రయత్నం చేయాలి. బంధువులకు మీరంటే ఎంత ఇష్టమో తెలియజేస్తే.. వారిలో భయం తొలగిపోయి.. కంఫర్ట్ గా ఉంటారు. 

Latest Videos

click me!