పిల్లలు మాట వినాలంటే ఇలా చేయండి

First Published | Oct 31, 2024, 4:01 PM IST

పిల్లలు చెప్పింది వినడం లేదు, చెప్పింది చేయడం లేదని చాలా మంది తల్లిదండ్రులు చాలా బాధపడిపోతుంటారు. కానీ కొన్ని ట్రిక్స్ ను ఫాలో అయితే మాత్రం మీ పిల్లలు మీరు చెప్పిన మాట ఖచ్చితంగా వింటారు. 

పిల్లలు మాట వినాలంటే?

పిల్లలు పెద్దగా అయ్యే కొద్ది తల్లిదండ్రుల మాట వినడమే మానేస్తుంటారు. చాలా మంది పిల్లలు మొండిగా, కోపంగా, చిరాకును చూపిస్తుంటారు. దీనివల్ల తల్లిదండ్రులకు కోపం వచ్చి పిల్లలపై చేయి చేసుకుంటుంటారు. దీనివల్ల తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య దూరం పెరుగుతుంది. 

పిల్లలు మాట వినాలంటే

 పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ ఏర్పడకూడదంటే తల్లిదండ్రులు కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలి. వీటిని మీరు గనుక పాటిస్తే మీ పిల్లలు మీరు చెప్పిన ప్రతి మాటా వింటారు. 


పిల్లలు మాట వినే టిప్స్

పిల్లలు మీ మాట వినేలా చేసే కొన్ని చిట్కాలు :

1. వాళ్ళ దృష్టిని ఆకర్షించండి:

మీ పిల్లల దృష్టిని ఆకర్షిస్తే గనుక వారు మీ మాట ఖచ్చితంగా వింటారు. అంటే మీ పిల్లల భుజం మీద చేత్తో తట్టడమో లేదా కళ్లతో వారితో మాట్లాడటం వంటి వాటి ద్వారా వారి దృష్టిని మీ వైపు తిప్పుకోండి. దీనివల్ల మీ పిల్లలు మీ మాట వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

2. నవ్వుతూ మాట్లాడండి:

ప్రతి పేరెంట్స్ పిల్లలతో నవ్వుతూ మాట్లాడటం నేర్చుకోవాలి. అంటే మీ పిల్లలతో మీరు ఏదైనా చెప్పేటప్పుడు నవ్వుతూ, ప్రశాంతంగా వారికి చెప్పాల్సిన విషయాలను చెప్పండి. దీనివల్ల వాళ్లు మీరు చెప్పిన విషయాలను సులువుగా అర్థం చేసుకుంటారు. 

పిల్లలు మాట వినే టిప్స్

3. తక్కువ మాటలు వాడండి:

ఎప్పుడైనా సరే పిల్లలకు ఎక్కువ మాటలు చెప్పకండి. అంటే మీరు మీ పిల్లలకు ఏదైనా చెప్పాలనుకున్నా, వారితో ఏ పనైనా చేయించాలనుకున్నా తక్కువ మాటలు మాట్లాడండి. చాలా మాటలను పిల్లలు అర్థం చేసుకోలేరు. మీరు చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోలేరు. అందుకే ఎప్పుడూ కూడా కొన్ని మాటల్లోనే విషయాన్ని పిల్లలకు చెప్పండి. 

4. అరవకండి:

చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఇది. పిల్లలపై కోపం వస్తే చాలు అరిచి వారిని కొట్టడం వంటివి చేస్తుంటారు.  ఒకవేళ మీ పిల్లలు మీరు చెప్పింది వినకపోతే వారిపై అరవకండి. దీనికి బదులుగా వారితో మర్యాదగా ప్రవర్తించండి. దీంతో వారు మీ మాట వినే అవకాశం ఉంది. 

పిల్లలు మాట వినే టిప్స్

5. రెండవ అవకాశం ఇవ్వండి:

పిల్లలు ఏదైనా పనిచేస్తున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పేది వినకపోవచ్చు. అందుకని వారిపై వెంటనే అరవకుండా.. కొంత సేపటి తర్వాత మళ్లీ చెప్పండి.

కొన్నికొన్ని సార్లు పిల్లలు ఒక విషయం నుంచి మరొక విషయంపై దృష్టి పెట్టడానికి సమయాన్ని తీసుకుంటారు. ఇలాంటప్పుడు వారితో మాట్లాడి కొంత సేపు ఆగండి. ఈ సమయంలో మీరు చెప్పేది మీ పిల్లలు అర్థం చేసుకుంటారు.

Latest Videos

click me!