పిల్లలను ఎలా నిద్రలేపాలో మీకు తెలుసా?

First Published | Aug 7, 2024, 5:19 PM IST

పేరెంట్స్ ఏమో... స్కూల్ కి టైమ్ అయిపోతుందని.. పిల్లలను బలవంతంగా నిద్రలేపేస్తూ ఉంటారు. అసలు.. పిల్లలను నిద్రలేపే పద్దతి ఏంటి..? వారికి ఎన్ని గంటలు నిద్ర అవసరం నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

child wakeup

ఉదయాన్నే  పిల్లలు ఉన్న ఏ ఇల్లు చూసినా హడావిడిగానే ఉంటుంది. ఎందుకంటే.. పిల్లలకు స్కూల్ టైమ్ అయిపోతుందని పేరెంట్స్ హడావిడి పడుతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు నిద్రలేవడానికి ఇష్టపడరు. పేరెంట్స్ ఏమో... స్కూల్ కి టైమ్ అయిపోతుందని.. పిల్లలను బలవంతంగా నిద్రలేపేస్తూ ఉంటారు. అసలు.. పిల్లలను నిద్రలేపే పద్దతి ఏంటి..? వారికి ఎన్ని గంటలు నిద్ర అవసరం నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

స్కూల్ కి వెళ్లే పిల్లలు.. కనీసం 10 గంటలు నిద్రపోవాలి.  10 గంటలలోపు పిల్లలు నిద్ర లేవడానికి ఇష్టపడరు. కాబట్టి... కనీసం పది గంటల నిద్ర అయినా.. వారికి సరిపోయేలా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ పై ఉంది. దాని కోసం వారిని ముందుగా నిద్రపోనివ్వాలి.
 

Latest Videos


parents

మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సాధారణంగా 12 నుండి 15 గంటల వరకు నిద్రపోతారు. 5, 10 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు 9 - 12 గంటల మధ్య నిద్రపోవాలి. మీ పిల్లలు వారి వయస్సుకి సరిపడా నిద్రపోకపోతే, వారు ఉదయాన్నే లేవలేరు.

parents


మీరు తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే, మీ పిల్లలు ఉదయం ఎందుకు నిద్రలేవరు. సమస్య తెలుసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. పిల్లలు ఉదయాన్నే నిద్ర లేవాలంటే ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి.


పిల్లలు రాత్రి త్వరగా నిద్రపోవాలి. కాబట్టి రాత్రిపూట పిల్లలను టీవీ, మొబైల్‌కు దూరంగా ఉంచాలి. పిల్లలు నిద్రించడానికి నిర్ణీత సమయాన్ని సెట్ చేసి కొన్ని రోజులు అలవాటు చేయండి. పిల్లలు ఈ సమయానికి సర్దుబాటు చేస్తే, అతను ఉదయాన్నే మేల్కొంటారు. రాత్రి తొందరగా నిద్రపోనివ్వాలి.

అంతేకాదు.. ఉదయాన్నే పిల్లలను తిడుతూ, కొడుతూ ఉంటారు. అలా కాకుండా... వారితో ప్రేమగా మాట్లాడి నిద్రలేపాలి. గట్టిగా అరుస్తూ, కేకలు వేయకండి. బలవంతంగా లేపడం వల్ల.. పిల్లలు నిద్రలేవచ్చు కానీ.. వాళ్ల మూడ్ డిస్టర్బ్ అవుతుంది.
 

పిల్లలకు నచ్చిన, ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ పెట్టండి. అది వారికి చెప్పి నిద్రలేపడానికి ట్రై చేయండి. ఆ బ్రేక్ ఫాస్ట్ కోసం అయినా.. పిల్లలు నిద్ర తొందరగా లేవడానికి ట్రై చేస్తారు.
 

parents

కొంతమంది పిల్లలు సంగీతం పట్ల ఆకర్షితులవుతారు. పిల్లలు సంగీతం ఇష్టపడితే, వారిని నిద్రలేపేటప్పుడు పాట పాడండి లేదా టీవీలలో మెలోడీ పాటను ప్లే చేయండి.

click me!