పిల్లలు ఫోన్ వాడకుండా ఉండాలంటే పేరెంట్స్ ఏం చేయాలి?

First Published | Jun 13, 2024, 9:58 AM IST

స్కూల్ కి వెళ్లే పిల్లలు ఫోన్ వాడకం పెరిగితే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో తెలుసా? వాళ్లను ఫోన్ కి దూరం చేయాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలి..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
 

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడని వాళ్లు లేరు. ఇంట్లో ఎంత మంది ఉంటే.. అంత మందికీ ఫోన్లు ఉండాల్సిందే. అయితే.. ఇంట్లో పెద్దవాళ్లు ఫోన్లు వాడుతుంటే పిల్లలు ఊరుకుంటారా..? వాళ్లకంటూ స్పెషల్ గా ఫోన్ ఇచ్చినా, ఇవ్వకపోయినా.. పేరెంట్స్ ది అయినా వాడేస్తూ ఉంటారు. ముఖ్యంగా యూట్యూబ్ లో వీడియోలు, గేమ్స్ లకు ఈ కాలం పిల్లలు బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు.
 

కనీసం భోజనం చేయాలన్నా... ఫోన్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా పిల్లలు తయారౌతున్నారు. ఎక్కడ పిల్లలు భోజనం చయరో అని పేరెంట్స్ కూడా తప్పక పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు.  కానీ.. పిల్లలు చిన్న వయసు నుంచే ఫోన్లు వాడటం మొదలుపెడితే ఏమౌతుందో తెలుసా? స్కూల్ కి వెళ్లే పిల్లలు ఫోన్ వాడకం పెరిగితే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో తెలుసా? వాళ్లను ఫోన్ కి దూరం చేయాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలి..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
 

Latest Videos


phone


పిల్లలు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం వల్ల కలిగే పరిణామాలు:

మొబైల్ ఫోన్ల వాడకం వల్ల పిల్లలు తమ తల్లిదండ్రులు , ఉపాధ్యాయుల మాట వినడానికి నిరాకరిస్తున్నారు. ఇంట్లో పేరెంట్స్ అంటే గారాభం చేస్తారు అనుకోవచ్చు. కానీ...స్కూల్లో టీచర్స్ మాట కూడా వినడం లేదు.

అంతేకాదు ఫోన్ల వాడకం పిల్లలపై రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సెల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ కళ్లకు హాని కలిగించి మెదడును దెబ్బతీస్తుంది. దీని నుండి వచ్చే రేడియేషన్ మెదడు జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది.
 


పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తే తలనొప్పి, మానసిక అలసట, ఒత్తిడికి గురవుతారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు మొబైల్ ఫోన్లలో ఎంత సమయం గడుపుతున్నారో తెలుసుకోవాలి. లేదంటే..చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయి. 

అంతేకాదు.. పిల్లలు ఫోన్లు వాడటం మొదలుపెడితే పిల్లలు పేరెంట్స్ కి కూడా సమస్యలు తెచ్చే ప్రమాదం ఉంది.  ఎందుకంటే.. ఆన్ లైన మోసాల బారిన పిల్లలు పడే ప్రమాదం ఉంది.  ఆన్‌లైన్ మోసాలు , పిల్లల లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ప్రత్యేకించి, అపరిచితులతో సంభాషించకుండా ఉండమని మీకు సలహా ఇవ్వాలి. పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌లో గడిపితే వారికి చదువుపై ఆసక్తి ఉండదు.ఇది వారి సామాజిక జీవితానికి హానికరం.

మరి పిల్లలు ఫోన్ కి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే పేరెంట్స్ ఏం చేయాలి..?
పిల్లలకు ఫోన్లు వాడే అలవాటు వాళ్ల పేరెంట్స్ దగ్గర నుంచే వస్తుంది. పిల్లలతో గడపాల్సిన సమయంలో ఫోన్లు పట్టుకొని కూర్చుంటే... వాళ్లకు కూడా ఫోన్లకు ఆకర్షితులౌతారు.  వాటిని పక్కన పెట్టి.. పిల్లలతో సమయం గడపడం మొదలుపెట్టాలి.తల్లిదండ్రులు తమ పిల్లలు మొబైల్ ఫోన్లలో ఎంత సమయం గడుపుతున్నారో తెలుసుకోవాలి.తల్లిదండ్రులు పిల్లలను ఆన్‌లైన్ తరగతులు కాకుండా శారీరక శ్రమ (క్రీడలు)లో చేర్చాలి. ఎక్కువగా ఆటలు ఆడించాలి.సెల్‌ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలి.

click me!