ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటారు. తమ పిల్లలు కష్టపడకూడదని, వారి కోసం అన్నీ సమకూరుస్తారు. కానీ.. చాలా మంది పేరెంట్స్ తెలిసో, తెలియక చేసే కొన్ని పనులు కారణంగా పిల్లలు సోమరిపోతుల్లా తయారౌతున్నారని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.
తల్లిదండ్రులు చేసే కొన్ని పనుల కారణంగానే పిల్లలు మొండిగా తయారై.. చివరకు ఆ పేరెంట్స్ మాటే వినకుండా పోతున్నారు. జీవితంలో బాధ్యత అనేది లేకుండా తయారౌతున్నారు. మరి.. పిల్లలు అలా కాకుండా.. మంచిగా జీవితంలో పైకి ఎదగాలంటే.. ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం..