Parenting Tips: స్కూల్ నుంచి పిల్లలు అలసిపోయి వస్తున్నారా? ఇలా చేయండి

Published : Mar 01, 2025, 03:24 PM IST

స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో పిల్లలు బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారా? అయితే కొన్ని చిట్కాలతో వారి అలసటను పొగొట్టవచ్చు. అదెలాగో చూద్దాం..

PREV
17
Parenting Tips: స్కూల్ నుంచి పిల్లలు అలసిపోయి వస్తున్నారా? ఇలా చేయండి

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా, ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే.. పిల్లలు.. స్కూల్ కి వెళ్లే సమయంలో ఉత్సాహంగా వెళతారు. కానీ... తిరిగి వచ్చేటప్పుడు మాత్రం  అసలిపోయి వస్తూ ఉంటారు. అలా అలసిపోయిన పిల్లలను చూస్తుంటే పేరెంట్స్ కి బాధగా ఉంటుంది. మరి, పిల్లల అలసటను ఎలా తగ్గించాలో  ఇప్పుడు చూద్దాం...

 

27

కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వండి..

బడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలను కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వండి. అరగంట నుండి గంట తర్వాత మీ పిల్లలకు పండ్ల రసం లేదా ఏదైనా పండ్లు తినడానికి ఇవ్వండి. కావాలంటే మీరు మీ పిల్లలకు డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వవచ్చు. ఆ తర్వాత గంట తర్వాత మీ పిల్లలను హోంవర్క్ చేయమని చెప్పండి.

37

చదివే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి:

మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలని గుర్తుంచుకోండి. అలాగే చదివేటప్పుడు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, వీడియో గేమ్స్ వంటి వాటికి మీ పిల్లలను దూరంగా ఉంచాలి. మీ పిల్లలు చదివి పూర్తయిన తర్వాత స్నేహితులతో ఆడుకోవడానికి అనుమతించండి లేదా వారికి ఇష్టమైన ఆటలు ఆడుకోవడానికి అనుమతించండి.

47
ఎక్కువ నీరు ఇవ్వండి:

నీరు పిల్లల మనస్సును ఉత్తేజపరచడమే కాకుండా, అలసటను కూడా తగ్గిస్తుంది. కాబట్టి, రోజంతా పిల్లలు ఎక్కువ నీరు తాగుతున్నారా లేదా అని గమనించాలి. నీరు వారి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పిల్లలు అలసిపోయినట్లు అనిపించరు.

 

57

పిల్లలతో కూర్చొని మాట్లాడండి:

సాయంత్రం బడి నుండి ఇంటికి వచ్చిన పిల్లలతో కాసేపు కూర్చొని మాట్లాడండి. బడిలో ఏం జరిగింది? ఏమి నేర్చుకున్నావు? వంటి విషయాలు అడిగి తెలుసుకోండి. దీని ద్వారా మీ పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీకు మీ పిల్లలకు మధ్య బంధం బలపడుతుంది. ముఖ్యంగా బడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల చేతిలో మొబైల్ ఫోన్ ఎప్పుడూ ఇవ్వకండి. అది మంచి అలవాటు కాదు.

67

మంచి నిద్ర అవసరం:

ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. అలాగే మీ పిల్లలను తెల్లవారుజామున నిద్రలేపి చిన్న వ్యాయామం చేయించండి. ఇది వారి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, అలసటను పోగొడుతుంది.

 

77
గుర్తుంచుకోండి:

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పే విషయాలను తప్పకుండా వినాలి. ఎందుకంటే చాలా సందర్భాలలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల అభిప్రాయాలను విస్మరిస్తారు. కానీ అది తప్పు. తల్లిదండ్రులు ఇలా ప్రవర్తిస్తే, వారు తమ పిల్లలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు.

Read more Photos on
click me!

Recommended Stories