మీ పిల్లలు ప్రతిదానికి భయపడుతున్నారా? ఇలా చేస్తే భయం పోతుంది

First Published Sep 25, 2024, 4:41 PM IST

చిన్నపిల్లలకు రకరకాల భయాలు ఉంటాయి. అయితే వారు సరిగా చెప్పలేరు. పేరెంట్స్, టీచర్స్ పిల్లలను అర్థం చేసుకొని వారి భయాలను పోగొట్టే బాధ్యత తీసుకోవాలి. లేకుంటే ఆ భయాలు రకరకాల ఫోబియాలుగా మారిపోతాయి. ఇవి భవిష్యత్తులో మానసిక రోగాలుగా మారి వారి ఉన్నతికి అడ్డుగా మారతాయి. అలాంటి కొన్ని ఫోబియాల గురించి ఇక్కడ తెలుసుకోండి. వాటిని ఎలా పోగొట్టాలో గుర్తించండి. 
 

డిడాస్కలీనో ఫోబియా(Didaskaleino phobia)
పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే చాలా భయపడతారు. ఇది ప్రతి ఇంట్లో పేరెంట్స్ ఎదుర్కొనే సమస్యే. ఈ భయాన్నే డిడాస్కలీనో ఫోబియా అంటారు. అయితే సొసైటీలో అన్ని రకాల విషయాలపై అవగాహన రావాలంటే చిన్న వయసు నుంచే స్కూల్ కి వెళ్లడం అలవాటు చేయాలి. వివిధ రకాల వ్యక్తులను డీల్ చేయడం పాఠశాల నుంచే మొదలవుతుంది. అయితే ఇదే వారికి సమస్యగా మారుతుంది. స్కూల్ లో రకరకాల వ్యక్తులు, డిఫరెంట్ క్యారెక్టర్స్ మధ్య వారు ఉండలేక స్కూల్ కి వెళ్లనంటారు. టీచర్స్ అంటే భయం, తోటి ఫ్రెండ్స్ ఏడిపించడం లాంటి విషయాలను కొంతమంది పిల్లలు సరిగా రిసీవ్ చేసుకోలేరు. అందుకే స్కూల్ కి వెళ్లనంటారు. 

స్టార్టింగ్ లోనే నచ్చజెప్పి, వారికి అర్థమయ్యేలా చెప్పి స్కూల్ కి పంపితే పెద్ద ప్రాబ్లమ్ కాదు. అయితే బలవంతంగా స్కూల్ కి పంపడం, కొట్టి, తిట్టి పంపితే మాత్రం వారు మొండిగా మారిపోతారు. భవిష్యత్తులో ఇవి మానసిక రోగాలకు దారి తీస్తుంది. 

సోఫోఫోబియా(Sophophobia)
ఇది చదువులో వెనకబడిపోవడం కలిగే భయాన్ని సోఫో ఫోబియా అంటారు. సబ్జెక్ట్ కష్టంగా ఉండటం వల్ల పిల్లలు అది నేర్చుకోవడానికి ఇష్టపడరు. పైగా ఆ సబ్జెక్ట్ కు సంబంధించి ఇక ఏ కొత్త విషయాన్ని వారు నేర్చుకోవడానికి అంగీకరించరు. అస్సలు ఆ విషయం గురించి తెలుసుకోను అని మొండిగా చెప్పేస్తారు. ఉదాహరణకు చాలా మందికి మ్యాథ్స్ అంటే చాలా భయం. ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నించినా మళ్లీ కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి భయపడతారు. అందువల్లనే చాలా మంది మ్యాథ్స్ ను ఇష్టపడరు. ఈ సోఫో ఫోబియా వయసు పెరిగే కొద్దీ పెరిగి మరిన్ని మానసిక ఆందోళనలకు దారి తీస్తుంది. 

ఈ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ పై ఇష్టాన్ని పెంచుకోవాలి. టీచర్స్ కూడా విద్యార్థులను భయపెట్టి సబ్జెక్ట్ నేర్పడం కంటే వారు ఇష్టపడేలా సింపుల్ టెక్నిక్స్ తో పాఠాలు చెప్పడం వల్ల స్టూడెంట్స్ లో కష్టమైన సబ్జెక్ట్స్ పై భయం పోతుంది. 

Latest Videos


అటెలో ఫోబియా(Atelophobia)
విద్యార్థులు ఒక పని స్టార్ట్ చేసినప్పుడు వివిధ కారణాల వల్ల వారు దాన్ని పూర్తి చేయలేకపోయారు అనుకుందా. దీంతో వారిలో ఒక రకమైన ఆందోళన కలుగుతుంది. ఈ భయాన్నే అటెలో ఫోబియా అంటారు.  హోమ్ వర్స్ పూర్తి చేయలేదని, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వలేదని, ఇలా అనేక విషయాల గురించి పిల్లలు భయపడుతుంటారు. ఈ భయం వల్ల ఇతర విషయాల్లోనూ తప్పులు చేస్తుంటారు. దీంతో ఈ ఫియర్ మరింత పెరిగి తీవ్రమైన మానసిక సమస్యలకు దారి తీస్తుంది. దీంతో కొంత కాలానికి వారు పనులు చేయకుండా ఎస్కేప్ అవడానికి అలవాటు పడతారు. హోమ్ వర్స్ చేయమంటే వివిధ రకాల కారణాలు చెబుతుంటారు. తిట్లు, దెబ్బలు తినడానికైనా సిద్ధమైపోతారు కాని పనులు చేయమంటే ఇష్టపడరు. ఒక వేళ బలవంతంగా చేయిస్తే వారిలో కాన్ఫిడెస్స్ తక్కువగా ఉండటం వల్ల అవి ఫెయిల్ అయిపోతాయి. 

పిల్లలకు ముందుగా వారిలో ఆత్మ విశ్వాసం క్రియేట్ చేయాలి. హోమ్ వర్స్క్ దగ్గరుండి చేయించాలి. తప్పులు చేసినా ఓపిగ్గా చెప్పాలి. ఇలా కొంత కాలానికి వారిపై వారికే నమ్మకం ఏర్పడి అటెలో ఫోబియా నుంచి బయటపడతారు. 

టెస్టో ఫోబియా(Testophobia)
పరీక్షలంటే భయపడని విద్యార్థులు ఎవరుంటారు చెప్పండి? ఈ భయాన్నే టెస్టో ఫోబియా అంటారు. ఎగ్జామ్స్ వస్తున్నాయంటే పిల్లలు తీవ్రమైన టెన్షన్ కు గురవుతారు. ఎగ్జామ్స్ పేరు ఎత్తగానే చెమటలు పట్టేస్తాయి. కొంతమందికి జ్వరాలు కూడా వచ్చేస్తాయి. అంత భయపడతారు పరీక్షలంటే. ఇది చిన్నతనం నుంచే కొనసాగితే పెద్దయ్యాక వారి పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. జాబ్ చేసే ప్లేస్ లో మంచి పర్ఫామెన్స్ ఇవ్వలేరు. తరచూ మేనేజర్, బాస్ చేత తిట్లు తింటూ ఉంటారు. 

ఇలా జరగకూడదంటే చిన్న వయసులోనే పిల్లలకు పరీక్షలంటే భయం పోయేలా చేయాలి. దీనికి టీచర్స్, పేరెంట్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలకు ఏం విషయం సరిగా అర్థం చేసుకోలేరు. అందుకే బుజ్జగించి, నవ్వుతూ విషయాలను వివరించాలి. పరీక్షల్లో మంచి మార్కులు రాకపోయినా ఫర్వాలేదు అని చెప్పడం కంటే ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకోవడం వల్ల కలితే ప్రయోజనాలు ఏమిటో వివరించాలి. దీని వల్ల వారిలో టెస్టో ఫోబియా పోతుంది. 

నోమో ఫోబియా(Nomophobia)
ఈ జనరేషన్ విద్యార్థులు ఫోన్ లేకుండా చదవలేని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్ట్స్ అని, ఆన్ లైన్ క్లాస్ లని, ఇలా ఏదో రకంగా పేరెంట్స్ కూడా వారికి ఫోన్లు ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. కొన్నాళ్లకు స్టూడెంట్స్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. పనున్నా లేకపోయినా ఫోన్ చూస్తూ కూర్చొంటున్నారు. ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లల నుంచి టీనేజర్స్ వరకు ఉంది. పిల్లలేమో ఆటలు, కార్టూన్ వీడియోలు చూడటానికి గోల చేస్తారు. టీనేజర్స్ అయితే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్టా లాంటి వాటిలో అందరితోనూ నిరంతరం టచ్ లో ఉండటానికి ఫోన్ పట్టుకునే కూర్చొంటున్నారు. ఇలాంటి వారందరికీ ఫోన్ ఉండదని చెబితే కలిగే భయాన్నే నోమో ఫోబియా అంటారు. ఈ ఫోబియా ఉన్న వారు ఏ ఇతర పనులపైనా కాన్సన్ ట్రేషన్ పెట్టలేరు. పొరపాటున కొంచెం సేపు ఫోన్ కనిపించకపోయినా, దాన్ని వదిలి వేరే పని చేయాలన్నా తీవ్రమైన ఆందోళన చెందుతారు. 

ఈ పరిస్థితి నుంచి పిల్లలు, టీనేజర్స్ బయటపడాలంటే పేరేంట్స్ లీడ్ తీసుకోవాలి. వారితో టైమ్ స్పెండ్ చేయాలి. ఆన్ లైన్ గేమ్స్ కాకుండా వారితో కలిసి చెస్, క్యారమ్స్, క్రికెట్ వంటి ఆటలు ఆడాలి. దీని వల్ల వారిలో ఫోన్ లేకుండా కూడా మనం ఉండగలమన్న ధీమా ఏర్పడుతుంది. 

గ్లోసో ఫోబియా(Glossophobia)
ఎవరికైతే స్టేజ్ ఫియర్ ఉంటుందో, అందరి ముందు మాట్లాడాలన్నా, ఏదైనా పర్ఫామెన్స్ చేయాలన్నా భయపడతారో వారికి ఉన్న ఈ భయాన్నే గ్లోసో ఫోబియా అంటారు. ఇలాంటి విద్యార్థులు ఎవరితోనూ ఎక్కువగా కలవరు. ఇలాంటి వారికి దాదాపుగా ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఉన్న వారు కూడా గ్లోసో ఫోబియాతో బాధపడేవారే అవుతారు. బలవంతంగా వారిని స్టేజ్ ఎక్కిస్తే వారు ఒక్కసారిగా నీరసపడిపోతారు. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. 

ఈ ఫోబియా నుంచి బయటపడాలంటే విద్యార్థులు ముందు వారిలో ఉన్న టాలెంట్ ను గుర్తించాలి. ఆ విషయంపై గ్రిప్ తెచ్చుకోవాలి. ఉదాహరణకు పాటలు పాడటం ఇష్టమున్నట్లయితే సరిగా పాడలేమన్న భయం వల్లే గ్లోసో ఫోబియా కలుగుతుంది. అదే సాంగ్ బాగా నేర్చుకుని ఇంటి దగ్గరే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఎప్పుడు స్టేజ్ పై పర్ఫామెన్స్ ఇద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. 

జిలోటో ఫోబియా(Gelotophobia)
మనల్ని చూసి నవ్వుతారన్న భయాన్ని జిలోటో ఫోబియా అంటారు. సాధారణంగా ఫ్రెండ్స్ మధ్య గుడ్ కమ్మూనికేషన్ పెరగాలంటే జోక్స్ వేసుకోవడం ఉండాలి. చిన్న చిన్న గొడవలు కూడా జరగాలి. అయితే కొంత సేపటికి రియలైజ్ అయి ఎవరిది తప్పైతే వారు ఫ్రెండ్ కి సారీ చెప్పి మళ్లీ నార్మల్ అయిపోవాలి. ఇది చాలా చోట్ల జరగదు. నాపైనే జోక్స్ వేస్తారా? నన్ను ఇన్సల్ట్ చేస్తారా అంటూ పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఈ పరిస్థితి విద్యార్థులను సమాజానికి దూరం చేస్తుంది. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటానికి, ఒంటరిగా ఉండటానికి వారు అలవాటు అయిపోతారు. 

click me!