ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ కాలం పిల్లలకు టీవీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు ఎలా ఆపరేట్ చేయాలో కూడా స్పెషల్ గా వివరించాల్సిన అవసరం లేదు. పుట్టుకతోనే తమకు వాటి గురించి తెలుసు అన్నట్లుగా అయిపోయారు. చేతికి ఫోన్ ఇస్తే చాలు.. తెగ నొక్కేస్తారు, గేమ్స్ ఆడేస్తారు. మరి.. అలాంటి ఈ జనరేషన్ కిడ్స్ కి.. కచ్చితంగా కొన్ని పాత పద్దతులు తెలిసి ఉండకపోవచ్చు. కానీ.. వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన, ఆచరించాల్సిన కొన్ని పాతకాలం పద్దతులు ఉన్నాయి. మరి అవేంటో మనమూ తెలుసుకొని, మన పిల్లలకు నేర్పుదాం..