ప్రతి పేరెంట్స్.. తమ పిల్లలను చాలా గొప్పగానే పెంచాలని అనుకుంటారు. వారు అడగక ముందే అన్ని తెచ్చి ఇవ్వాలని అనుకుంటారు. అంతేకాదు.. అన్ని దేశాల్లో కంటే... ఇండియన్ పేరెంట్స్ చాలా గొప్పగా ఉంటారని, పేరెంటింగ్ అంటే.. మన దగ్గరే నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ.. మనం కూడా వెస్ట్రన్ దేశాల నుంచి ముఖ్యంగా పేరెంటింగ్ టిప్స్ మాత్రం కొన్ని నేర్చుకోవాల్సిందేనట. మరి, అవేంటో ఓసారి చూద్దాం..
1. మన దేశంలో పేరెంటింగ్ విషయంలో వంకలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ.. ఇక్కడ ఎక్కువగా పిల్లల విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటాం. పిల్లలు ఏం చదవాలి..? ఏం అవ్వాలి అనే విషయంలో పేరెంట్స్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే.. వెస్ట్రన్ దేశాల్లో మాత్రం పిల్లలను స్వతంత్రంగా పెరిగే అవకాశం కల్పిస్తారు. ఆ క్వాలిటీ మనం కూడా ఇక్కడ నేర్చుకోవడం చాలా అవసరం. అలా వారికి స్వతంత్రంగా పెరగడం వల్ల, పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
2. పిల్లలకు వారి భవిష్యత్తు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనం వారికే వదిలేయాలి. దాని వల్ల .. వారిలో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అన్నింట్లోనూ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దాని వల్ల పిల్లల్లో సెల్ఫ్ రెస్పాన్సిబులిటీ కూడా పెరుగుతుంది.
3. మన దేశాల్లో దాదాపు. పిల్లలు పెద్దయ్యాక కూడా.. వారి ఖర్చులు మొత్తం పేరెంట్సే భరించడానికి ఇష్టపడతారు. కానీ, వెస్ట్రన్ కంట్రీస్ లో చిన్న వయసు నుంచే పిల్లల డబ్బుల విషయంలో కొన్ని విషయాలు నేర్పిస్తారట. మనీ విషయంలో బాధ్యతలు నేర్పిస్తారట. ఆ విషయంలో మనం కూడా ముందుండాలి. చిన్న వయసు నుంచే.. మనీ విలువ తెలిసేలా.. పిల్లలకు పాఠాలు నేర్పించాలి.
4. మన దేశంలో ఇప్పుడంటే కాస్త పర్వాలేదు. కానీ ఒకప్పుడు పేరెంట్స్ ఏ విషయాన్ని.. తమ పిల్లలతో పంచుకునేవారు కాదు. ముఖ్యంగా తండ్రులు.. ే విషయం మాట్లాడరు. కానీ.. ఈ విషయంలో వెస్ట్రన్ దేశాల నుంచి ఓ విషయం నేర్చుకోవాలి. అదేంటంటే.. వారు.. తమ పిల్లలతో ప్రతి విషయాన్ని ఓపెన్ గా ఉంచుతారు. ఓపెన్ కమ్యూనికేషన్ ఉండటం చాలా అవసరం.
5.ఈ రోజుల్లో చాలా మంది పని మీద దృష్టితో.. పిల్లలతో, ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ గడపడం లేదు. కానీ.. విదేశాల్లో మాత్రం వారికి ఎంత ఆఫీస్ వర్క్ ఉన్నా... పిల్లలతో అంతే సమయం గడిపేస్తారు. అది మనం కూడా నేర్చుకోవాల్సిందే.
6.మన దగ్గర పిల్లలలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే..వెంటనే ట్రీట్మెంట్ చేయిస్తారు. కానీ, మానసిక సమస్యల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఈ విషయంపై కూడా ఫోకస్ ఉండాలి. మానసిక సమస్యలను గుర్తించి, వారికి తగిన ట్రీట్మెంట్ ఇప్పించాలి.
7.పిల్లలకు ఆర్థికంగా మాత్రమే కాదు.. ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడంలోనూ ముందుండాలి. ఈ విషయంలో మనకంటే.. వెస్ట్రన్ దేశాలే ముందుంటాయట. మరి, నిజంగా.. ఈ విషయాలు మనం ఎడాప్ట్ చేసుకోవాలా వద్దా అనేది.. మీరే నిర్ణయించుకోవాలి.