ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖచ్చితంగా నేర్పాల్సిన విషయాలివి..!

First Published | Mar 19, 2024, 2:35 PM IST

ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి ఖచ్చితంగా నేర్పించాలి. కానీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు శారీరక భద్రత గురించి మాత్రం నేర్పించరు. కానీ పిల్లలకు దీని గురించి ప్రతి పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాలి. 
 

తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఇవి తినాలి? అవి తినొద్దు.. ఇవి తింటే  ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎండలో ఆడకూడదు. నీళ్లలో తడవకూడదు. లేదంటే జలుబు చేస్తుంది అంటూ ఎన్నో విషయాలను నేర్పుతారు. జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవి పిల్లలకు నేర్పడం చాలా అవసరం కూడా. కానీ ఖచ్చితంగా నేర్పించాల్సిన విషయాలను మాత్రం నేర్పరు. అవును మగపిల్లలైనా, ఆడపిల్లలైనా వారికి శారీరక భద్రత గురించి ఖచ్చితంగా నేర్పించాలి. ముందే పరిస్థితులు అస్సలు బాలేవు. పిల్లలు అమాయకులు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేరు. అంతా మనవాళ్లే అనుకుంటారు. అందుకే కొంతమంది తాకకూడదని చోట్ల తాకినా కూడా పేరెంట్స్ కు చెప్పరు. మీ పిల్లలు సురక్షితంగా ఉండాలంటే మాత్రం పిల్లలకు ఖచ్చితంగా నేర్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. 
 

నిపుణుల ప్రకారం.. చిన్న వయసు నుంచే పిల్లలకు శారీరక భద్రతపై అవగాహన కల్పించాలి. వారితో దీనిపై డిస్కషన్ చేయాలి. ఇది తల్లిదండ్రులకు, పిల్లలకు ఇబ్బంది కలిగించినా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇది మీ పిల్లలను రక్షిస్తుంది. తల్లిదండ్రులుగా మీరు వారిని నమ్ముతున్నారని, వారికి తోడు మీరున్నారని తెలియజేయడం చాలా అవసరం. అలాగే ఎలాంటి ఘటన జరిగినా వారు భయపడకుండా మీతో అన్ని విషయాలను చెప్పుకునేలా ప్రోత్సహించాలి. నిపుణుల ప్రకారం.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి శారీరక భద్రత గురించి అవగాహన కల్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


ముద్దు పెట్టుకోవడం లేదా కౌగిలించుకోవడం వంటి అవాంఛిత శారీరక సంపర్కానికి దూరంగా ఉండాలని పిల్లలకు చిన్నప్పటి నుంచే చెప్పాలి.  ఇది మంచి పద్దతి కాదని ఎవరైనా వారితో ఇలా చేయడానికి ప్రయత్నిస్తే  అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. అలాగే ఆ విషయాన్ని వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలన్న విషయాన్ని కూడా పిల్లలకు నేర్పాలి. ఏది మంచి? ఏది చెడో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. 
 

మీ పిల్లలు ఎప్పుడైనా భయం భయంగా లేదా అసౌకర్యంగా ఉంటే  వారితో  మాట్లాడండి. తిట్టడం లేదా బెదిరించడం కాకుండా నిదానంగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. దానికి గల కారణమేంటో తెలుసుకోండి. 

అలాగే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి ప్రైవేట్ ప్రాంతాలకు సంబంధించిన సరైన పదజాలంపై అవగాహన కల్పించాలి. అలాగే ఎవరైనా ఆ భాగాలను తాకడానికి ప్రయత్నిస్తున్నట్టైతే వెంటనే ఆ వ్యక్తికి దూరంగా వెళ్లమని చెప్పండి. అలా ప్రవర్తించిన వ్యక్తి ఎవరన్నది తల్లిదండ్రులకు ఖచ్చితంగా తెలియజేయాలని కూడా పిల్లలకు నేర్పించాలి. 
 

3 నుంచి 5 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఖచ్చితంగా నేర్పించండి. హగ్,  హై-ఫైవ్స్ వంటి ఆప్యాయమైన హావభావాల మధ్య తేడాను గుర్తించడానికి  ఇది వారికి బాగా సహాయపడుతుంది. గుడ్ టచ్ సురక్షితంగా, ప్రేమగా అనిపిస్తే.. బ్యాడ్ టచ్ బెదిరింపు లేదా అసౌకర్యంగా అనిపిస్తుందని చెప్పండి.  

పిల్లలకు ఏదైన జరగకూడనిది జరగకూడదంటే వారికి  లైంగిక వేధింపుల ప్రమాదం ప్రారంభ సంకేతాల గురించి చెప్పండి. అవగాహన కల్పించండి. పిల్లలు భయపడినా, అసౌకర్యంగా ఉన్నా, చెమట పట్టడం, కడుపునొప్పి, వణుకు, గుండె వేగంగా కొట్టుకున్నా మీరు జాగ్రత్త పడాల్సిందే. వారికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి శారీరం ఈ లక్షణాలను చూపిస్తుంది. 

మీ పిల్లలు అసౌకర్యంగా లేదా కలత చెందే విషయాల గురించి వారితో, వారి ముందు మాట్లాడటం మానుకోండి. ఒక పరిస్థితి గురించి వారు ఎప్పుడైనా అసురక్షితంగా లేదా అసౌకర్యంగా భావిస్తే.. నమ్మకమైన వ్యక్తులకు విషయాలను చెప్పడం వారికి నేర్పండి. 

Latest Videos

click me!