పేరెంట్స్ ఏం చేస్తే.. పిల్లలు ఈ గొప్ప విషయాలు నేర్చుకుంటారో తెలుసా?

First Published | Jan 13, 2024, 1:11 PM IST

పేరెంట్స్ కూడా దానిని ఫాలో అవ్వాలి. వాళ్లు ఫాలో అయ్యి.. ఇదే విషయాన్ని తమ పిల్లలకు ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ అనే విషయాన్ని కచ్చితంగా నేర్పించాలి.

చిన్నప్పుడు పిల్లలకు వాళ్ల పేరెంట్స్ రోల్ మోడల్స్. తాము కూడా పెద్దయ్యాక తమ పేరెంట్స్ లాగే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అంతెందుకు.. పిల్లలు చేసే చాల పనులు తమ పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు. అది మంచో, చెడో పక్కన పెడితే.. వాళ్లు.. చాలా విషయాల్లో పేరెంట్స్ ని కాపీ చేయడానికి ఇష్టపడతారు. ఇలాంటి సమయంలోనే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. మనం మంచి చేస్తే వారు కూడా మంచి నేర్చుకుంటారు అని గుర్తుంచుకోవాలి.  పిల్లలు కచ్చితంగా తమ పేరెంట్స్ ని నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...
 

1.పిల్లలు చిన్న విషయాలకే సంబరపడిపోతుంటారు.. చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు. వారికి ఏ ఏమోషన్ వచ్చినా దానిని వెంటనే బయటపెట్టేస్తూ ఉంటారు. కానీ.. పెద్దలు అలా కాదు.. వారికి ఎమోషన్స్ ని ఎప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి..పిల్లలు.. కచ్చితంగా ఈ విషయంలో తమ పేరెంట్స్ నుంచి పిల్లలు కూడా నేర్చుకోవాలి. వారు ఆ విషయాలు నేర్చుకోవాలి అంటే..ముందు పేరెంట్స్ కూడా దానిని ఫాలో అవ్వాలి. వాళ్లు ఫాలో అయ్యి.. ఇదే విషయాన్ని తమ పిల్లలకు ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ అనే విషయాన్ని కచ్చితంగా నేర్పించాలి.

Latest Videos


2.పిల్లలు స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు..తమ పేరెంట్స్ వర్క్ చేసే విధానాన్ని గమనిస్తూ ఉంటారు.  మనం ఎంత బాధ్యతగా ఉన్నాం అనే విషయాన్ని కూడా పిల్లలు గమనిస్తారు. అందుకే...  ఈ విషయంలో మనం రోల్ మోడల్ గా ఉండాలి. ఇంటి పనులు, ఆఫీసు పనులు చేసుకుంటూనే, కుటుంబ బాధ్యతలు ఎంత బాగా నిర్వహిస్తున్నాం, ఎంత కమిట్మెంట్ తో ఉన్నాం అనే విషయాన్ని కూడా పిల్లలు నేర్చుకోవాలి. ఇది వారి భవిష్యత్తుకు ఎంతో సహాయపడుతుంది.
 

3.ఏ విషయంలో అయినా.. ఫ్యామిలీ ఫస్ట్ అనేది ముందు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే... అది మన దగ్గర నుంచి పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఎలాంటి పనులు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఫ్యామిలీ ఫస్ట్ ప్రయార్టీగా ఉండాలి. ఇది మనం ఫాలో అయితే.. మన పిల్లలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది.

4.ఒక బంధాన్ని మనం ఎలా చూస్తున్నాం అనే విషయాన్ని కూడా మన పిల్లలు మన నుంచి నేర్చుకుంటారు. ఇతరులకు గౌరవం ఇవ్వడం, మంచిగా కమ్యూనికేట్ చేయడం లాంటివి చేయడం ముఖ్యం. ఇవి మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు.
 

5.పిల్లలు.. జీవితంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. దానికోసం మనం ఆర్థికంగా పిల్లలు ఎలా ఎదగాలి అనే విషయాన్ని కూడా నేర్పించాలి. మనం సరిగా ఫాలో అయితే.. వాళ్లు కూడా అవి నేర్చుకుంటారు.
 

6.మరో ముఖ్యమైన విషయం టైమ్ మేనేజ్మెంట్.  టైమ్ మేనేజ్మెంట్ అనేది  చాలా ముఖ్యమైన విషయం. జీవితంలో గొప్పగా ఎదగాలి అంటే.. టైమ్ మేనేజ్మెంట్ చాలా అవసరం. ఇది పిల్లలు.. తమ పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. కాబట్టి.. ముందు మనం టైమ్ మేనేజ్మెంట్ ని ఫాలో అవ్వాలి.

click me!