చిన్న పిల్లలను ముద్దు పెట్టుకోవచ్చా..?

First Published | May 15, 2024, 12:31 PM IST

. పిల్లలను ముఖం, పెదాలపై ముద్దు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. పిల్లలకు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు.  ఆ పిల్లల ఆలనా , పాలనా చూసుకుంటూ ఇంట్లో వాళ్లు మురిసిపోతూ ఉంటారు. ఇక చిన్న పిల్లల అమాయకపు చూపులు, బోసి నవ్వులు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. వెంటనే వాళ్లని అలా చూడగానే ముద్దు వచ్చేస్తారు. ఆటోమెటిక్ గా పిల్లలను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది పెట్టేస్తూ ఉంటాం కూడా. కానీ... అలా చిన్న పిల్లలకు ముద్దులు పెట్టొచ్చా..? ముఖ్యంగా అప్పుడే పుట్టిన చిన్నారులను ముద్దాడితే ఏమౌతుంది..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
 

new born baby

దాదాపు మనం పిల్లలను ముద్దు పెట్టుకునేటప్పుడు.. చెంపలు, లేదంటే పెదాలపై పెడుతూ ఉంటాం. బయటి వాళ్లు అయితే కాస్త ఆలోచిస్తారేమో కానీ.. పేరెంట్స్ అలా కాదు కదా. తమ పిల్లలే కదా అని ముద్దాడుతూ ఉంటారు. కానీ.. పిల్లలను ముఖం, పెదాలపై ముద్దు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. పిల్లలకు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
 


అప్పుడే పుట్టిన పిల్లలకు రోగనిరోధక శక్తి అంతగా డెవలప్ అవ్వదు. అంతేకాదు.. వారి శరీరం కూడా చాలా డెలికేట్ గా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు రావడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడే పుట్టిన వారికి వ్యాక్సిన్స్ కూడా అన్నీ పూర్తి అవ్వవు. కకాబట్టి... ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
 


ముద్దు పెట్టినప్పుడు మన లాలాజలం వారికి అంటుకుంటుంది. దాని వల్ల పిల్లలకు ఫ్లూ, కోవిడ్, శ్వాసకోస సమస్యలు, హెపటైటిస్ బి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలా అని ముద్దు పెట్టకోకుండా ఉండలేకపోతున్నాం అంటే... చేతులు, కాళ్లు ముద్దాడవచ్చు.
 

కొందరు.. చిన్న పిల్లలను వారి బ్రదర్, సిస్టర్ చేతుల్లో పెడుతూ ఉంటారు. ఇంట్లో ముందు పుట్టిన పిల్లలతో.. ఈ బిడ్డకు ముద్దులు పెట్టిస్తూ ఉంటారు. కానీ....స్కూల్ కి వెళ్లే పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి.చాలా మంది పిల్లలను కలుస్తారు కాబట్టి.. రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉండొచ్చు. కాబట్టి.. వారితో కూడా ముద్దులు లాంటివి పెట్టించకుండా ఉండటమే మంచిది.
 

పిల్లలను ముద్దాడే సమయంలో పేరెంట్స్ లిప్ స్టిక్, లిప్ గ్లాస్, లిప్ బామ్ లాంటివి రాసుకోకుండా ఉండటమే మంచిది. పుట్టిన బిడ్డను చూడటానికి బంధువులు, స్నేహితులు వచ్చినా కూడా.. సున్నితంగా ముద్దు పెట్టుకోవద్దని వారికి చెప్పాలి. బిడ్డను పట్టుకునే సమయంలోనూ.. కచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎవరికైనా జలుబు, దగ్గు లాంటివి ఉన్నవారికి బిడ్డను ఇవ్వకపోవడమే మంచిది. వారికి చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి.

Latest Videos

click me!