ఈ అలవాట్లు మీ పిల్లల జీవితాన్ని మార్చేస్తాయి...!

First Published | May 15, 2024, 10:17 AM IST

పిల్లలు మాట వినాలన్నా... వారు సమాజంలో  ఉత్తమంగా ఉండాలన్నా వారికి కొన్ని అలవాట్లు నేర్పించాలి. ఈ కింది అలవాట్లు నేర్పిస్తే... మీ పిల్లల జీవితం మూడు నెలల్లోనే మార్పు వస్తుంది. వారు ఉత్తమంగా తయారౌతారు.
 

తమ పిల్లల జీవితం బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికోసం  ప్రతి పేరెంట్స్ తమ పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా ఉండాలని చాలా జాగ్రత్తపడుతూ ఉంటారు. వారికి కావాల్సినవన్నీ.. అడక్కుండానే తెచ్చి ఇస్తూ ఉంటారు. అయితే.. ఇవన్నీ పిల్లలను గారంగా, మొండిగా తయారు చేస్తుంది. చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లలు తమ మాట వినడం లేదు అని చెబుతూ ఉంటారు. పిల్లలు మాట వినాలన్నా... వారు సమాజంలో  ఉత్తమంగా ఉండాలన్నా వారికి కొన్ని అలవాట్లు నేర్పించాలి. ఈ కింది అలవాట్లు నేర్పిస్తే... మీ పిల్లల జీవితం మూడు నెలల్లోనే మార్పు వస్తుంది. వారు ఉత్తమంగా తయారౌతారు.
 

Kids alone


పిల్లలకు మంచి అలవాట్లు పేరెంట్సే స్వయంగా నేర్పించాలి. ఆ అలవాట్లను పిల్లలు పూర్తిగా ఎడాప్ట్ చేసుకునే వరకు పేరెంట్స్ కాస్త ఓపికగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా సాధించాలి అంటే... ఓపిక చాలా అవసరం. మనం పది రోజులు నేర్పించి.. ఈ పిల్లలతో మన వల్ల కాదు అని వదిలేయకూడదు. కనీసం మూడు నెలల పాటు నేర్పించాలి. అప్పుడే పిల్లలు కూడావాటికి అలవాటు అవుతారు.

Latest Videos


kids

1.పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. దానిని వారికి అలవాటు చేయడం కోసం పేరెంట్స్ దగ్గరుండి మరీ 20 నిమిషాలు కేటాయించాలి. ప్రతిరోజూ 20 నిమిషాలు పిల్లలతో పుస్తకం చదివించాలి. అది స్టోరీ బుక్స్ అయినా, వారికి నచ్చినవి ఏవైనా పర్వాలేదు. దాని వల్ల పిల్లల్లో వాకుబులరీ, క్రియేటివిటీ పెరుగుతుంది.  నెమ్మదిగా... పుస్తకాలు చదివే అలవాటు వచ్చేస్తుంది. ఈ అలవాటు వారికి జీవితాంతం సహాయపడుతుంది.

foods for kids

2.పిల్లలు శారీరకంగా ఎదిగేందుకు పేరెంట్స్ చాలా చేస్తారు. కానీ.. పిల్లలు మానసికంగా ఎదిగేందుకు కూడా ప్రయత్నించాలి. దాని కోసం వారితో.. మెడిటేషన్, బ్రీతింగ్  వ్యాయామాలు చేయించాలి. వీటిని రెగ్యులర్ గా వారికి అలవాటు చేయడం వల్ల.. వారిలో ఒత్తిడి లెవల్స్ ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

.చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు చిన్నతనం లో ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని అనుకోరు. అంత చిన్నపిల్లలకు ఇప్పుడు అవన్నీ అవసరమా అనుకుంటారు. కానీ.. చిన్నతనం నుంచే వారికి.. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చేయాలి.  నడక, రన్నింగ్, డ్యాన్సింగ్, సైక్లింగ్ లాంటివి కచ్చితంగా రోజూ ఒక గంట చేసేలా ప్రోత్సహించాలి. ఇవి పిల్లల్లో ఎనర్జీ లెవల్స్ పెరిగేలా చేస్తాయి.
 

పిల్లలు జంక్ ఫుడ్ కి ఎక్కువ ఎట్రాక్ట్ అవుతారు. అవి మనం నేర్పకపోయినా వాటిని తింటూ ఉంటారు. కానీ.... ఆరోగ్యకరమైన ఆహారం మాత్రం మనమే కచ్చితంగా నేర్పించాలి. ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, ఆరోగ్యానికి సహాయపడే  పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేయాలి.

kids

5.ప్రతి పిల్లల్లో ఏదో ఒక క్రియేటివిటీ ఉంటుంది. దానిని పేరెంట్స్ గుర్తించాలి. వారితో పేపర్ క్రాఫ్ట్స్ చేయిండం, కలరింగ్, డ్రాయింగ్ లాంటివి  కూడా చేయించాలి. వారికి నచ్చిన దానిని చేసేలా ప్రోత్సహించాలి. అప్పుడే వారి ఆలోచనా విధానం ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది.
 

6. ఇక ఈ రోజుల్లో పిల్లలు మొత్తం ఆన్ లైన్ ప్రపంచంలోనే బతికేస్తున్నారు. అలాంటి వారికి.. ఆఫ్ లైన్ ప్రపంచాన్ని అలవాటు చేయాలి. బంధువులు, స్నేహితులతో ఇంటరాక్షన్ పెరిగేలా ప్రోత్సహించాలి. వర్చువల్, రియల్ ప్రపంచానికి ఉన్న తేడా అర్థమయ్యేలా చేయాలి.
 

Kids food

7. ఇక పిల్లలు స్కూల్ కి వెళ్తున్నా... హాలీడేస్ లో ఇంట్లో ఉంటున్నా కూడా... వారికి కనీసం 8 గంటల నిద్ర ఉండేలా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ దే.  మంచి నిద్ర ఉన్నప్పుడే పిల్లలు శారీరకంగా , మానసికంగా, ఎమోషనల్ గానూ ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు.

8.ఇక పిల్లలకు జాలి, దయ లాంటివి కూడా కచ్చితంగా నేర్పించాలి. ఇతరులకు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడం కూడా నేర్పించాలి. ఎవరైనా ప్రమాదంలో ఉంటే మనకు ఎందుకులే అనుకునేలా కాకుండా.. మన వంతు సహాయం చేయడంలో ముందుండాలి.

click me!