పిల్లల విషయంలో తల్లులు అస్సలు చేయకూడని తప్పులు ఇవే...!

First Published | May 11, 2024, 3:01 PM IST

తమ పిల్లలను గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలిపెడుతున్నారు. కానీ... మీ పిల్లలను మీరే పెంచాలి. వారికి మీరు కచ్చితంగా క్వాలిటీ టైమ్ కేటాయించాలి. 

ప్రతి తల్లి తన బిడ్డపై అమితమైన ప్రేమ పెంచుకుంటుంది. అమ్మ ప్రేమ విషయంలో మనం ఎలాంటి లోపాలు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు.  కానీ... తెలిసీ తెలియక చాలా మంది తల్లులు.. పిల్లల పెంపకంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రోజుల్లో పేరెంట్స్ కి పిల్లలపై ప్రేమ ఉంటే సరిపోదు. పిల్లలను పెంచే సమయంలో మనం చాలా విషయాలు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో....తమ పిల్లలను గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలిపెడుతున్నారు. కానీ... మీ పిల్లలను మీరే పెంచాలి. వారికి మీరు కచ్చితంగా క్వాలిటీ టైమ్ కేటాయించాలి. 


చాలా సార్లు పిల్లలు తగినంత సమయం తల్లులు కేటాయించకపోవడం వల్ల చైల్డ్ హుడ్ ట్రామాకి గురౌతూ ఉంటారు.   మీ బిజీ షెడ్యూల్‌ల నుండి వారి కోసం సమయాన్ని వెచ్చించండి. వారితో మాట్లాడండి.. వారు చెప్పేది వినండి. 


ఒకరితో ఒకరు పోల్చుకోకండి
తరచుగా తల్లిదండ్రులు తమ బిడ్డను చుట్టుపక్కల ఉన్న పిల్లలతో లేదా బంధువుల పిల్లలతో పోల్చడం ప్రారంభిస్తారు. ప్రతి బిడ్డ స్వభావం, అవగాహన పోల్చదగినది కాదని మీరు అర్థం చేసుకోవాలి. అందువల్ల, మీ బిడ్డను ఇతర పిల్లలతో ఎక్కువగా పోల్చవద్దు. 
 

చాలా మంది పేరెంట్స్ కామన్ గా చేసే తప్పు ఇది. పిల్లలు ఉన్నా, వాళ్లు చూస్తున్నా కూడా.. వాళ్ల ఎదురుగానే గొడవలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా తల్లి.. పిల్లల మందే తండ్రి తో ఏదో ఒక వాదనకు దిగుతుంది. కానీ దాని వల్ల పిల్లలు మానసికంగా చాలా ఎఫెక్ట్ అవుతారు. వారి ముందు పోట్లాడుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం లాంటివి చేయకూడదు. భార్యభర్తల మధ్య సమస్యలు ఉన్నా.. పిల్లల ముందు చూపించవచ్చు. అది వారిని మానసికంగా దెబ్బతీస్తుంది. 

Latest Videos

click me!