మీ పిల్లలు జలుబు వల్ల ఫాస్ట్ గా శ్వాస తీసుకుంటేంట, శ్వాస తీసుకుంటుంటే శబ్దం వస్తే.. వారి ఛాతీలో శ్లేష్మం పేరుకుపోయిందని అర్థం చేసుకోవాలి. ఈ శ్లేష్మం బయటకు వస్తేనే వారికి ఉపశమనం కలుగుతుంది. అయితే కొన్ని ఆయుర్వేద పద్దతులు ఇందుకు బాగా సహాయపడతాయి. అవేంటంటే?
సెలెరీ ఆవిరి
కాషాయం పెద్దలే తాగడానికి ఇష్టపడరు. ఇక చిన్నపిల్లలేం తాగుతారు. అందుకే వారు చేసే పనులతోనే వారి జలుబును తగ్గించాలి. ఇందుకు ఆవిరి బాగా సహాయపడుతుంది. ఇది మూసుకుపోయిన ముక్కును తెరవడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం నీళ్లలో ఒక టీస్పూన్ సెలెరీని వేసి మరిగించండి. ఇది మరుగుతున్నప్పుడు పిల్లలకు దాని ఆవిరి వాసన చూపించండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇలా చేయండి. అయితే ఇలా రోజుకు మూడు నాలుగు సార్లు చేస్తే ముక్కు దిబ్బడ సమస్య తొందరగా తగ్గుతుంది.