పిల్లలకు బిస్కెట్లు పెడితే ఏమౌతుంది?

First Published | Nov 6, 2024, 4:48 PM IST

చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు బిస్కెట్లను ఇష్టంగా తింటారు. కానీ, బిస్కెట్లను ఎక్కువగా తినడం వల్ల మన శరీరానికి కలిగే సమస్యలు ఏంటో తెలుసుకుందాం...

పిల్లలు ఇష్టంగా తినే స్నాక్స్ లో బిస్కెట్లు ముందు వరసలో ఉంటాయి. పిల్లలను ఎట్రాక్ట్ చేసే చాలా రకాల  బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో.. పిల్లలు కూడా బిస్కెట్లు కొనే వరకు మారాం చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా కాదనకుండా కొనిస్తూ ఉంటారు. కానీ.. పిల్లలకు బిస్కెట్లు పెట్టడం మంచిదేనా? వీటిని తినడం వల్ల  ఆరోగ్యానికి కలిగే సమస్యలు ఏంటో చూద్దాం..

బిస్కెట్లు రుచికి తియ్యగా ఉంటాయి. నోట్లో పెట్టుకోగానే మరోటి తినాలనే కోరిక మరింత ఎక్కువగా కలుగుతూ ఉంటుంది.  ఈ బిస్కెట్ల తయారీలో పామాయిల్, డాల్డా వంటి వాడతారు. అది కూడా ఎక్కువ వేడి చేసి మరీ వాడతారు. దాని వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఎక్కువైతే కొలిస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు రావడానికి కారణం అవుతుంది.

Latest Videos


బిస్కెట్లలో పంచదార మాత్రమే కాదు ఉప్పు కూడా వేస్తారు. బిస్కెట్ చెడిపోకుండా, రుచిగా ఉండటానికి ఉప్పు వాడతారు. బీపీ ఉన్నవాళ్లు ఉప్పు ఎక్కువ తింటే ఇబ్బంది కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. వీటి తయారీలో రుచి, రంగు కోసం వాడే కెమికల్స్ కూడా హానికరం.

బిస్కెట్ తయారీలో చక్కెర, సుక్రోజ్, గ్లూకోజ్, ఈస్ట్, సోడియం బైకార్బోనేట్, రంగులు వాడతారు. మెత్తగా ఉండే బిస్కెట్లలో ప్రోటీన్ ఎక్కువ. కానీ, ఇవి చక్కెర స్థాయిని పెంచుతాయి. షుగర్, గుండె జబ్బు ఉన్నవాళ్లు బిస్కెట్లు ఎక్కువ తినకూడదు.

బిస్కెట్లు తినడం

బిస్కెట్లలో సోడియం బైకార్బోనేట్ ఎక్కువ. ఇది శరీరంలో ఎక్కువైతే బీపీ, కిడ్నీలో రాళ్ళు వంటి సమస్యలు రావచ్చు. బరువు కూడా పెరుగుతారు.

కొన్ని బిస్కెట్లు తక్కువ క్యాలరీలు అని చెప్తారు. కానీ ఒక క్రీమ్ బిస్కెట్‌లో కనీసం 40 క్యాలరీలు ఉంటాయి. బిస్కెట్లు ఎక్కువ తినడం మంచిది కాదు. టీ, కాఫీ, పాలతో బిస్కెట్లు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. పిల్లలు ఇలా తింటే జీర్ణ సమస్యలు రావచ్చు.

click me!