పిల్లలకు పేరెంట్స్ కొనకూడని బొమ్మలు ఇవే..!

First Published | Nov 1, 2024, 12:00 PM IST

పిల్లలు మారాం చేశారు కదా.. అడిగారు కదా, ఏడ్చారు కదా అని మాత్రం కొన్ని బొమ్మలు మాత్రం అస్సలు కొనడదట.  పొరపాటున కూడా పేరెంట్స్ పిల్లలకు కొనకూడని బొమ్మలు ఏంటో ఓసారి చూద్దాం…

ఈ రోజుల్లో దాదాపు పేరెంట్స్ అందరూ తమ పిల్లలను చాలా గారంగా పెంచుకుంటన్నారు. వాళ్లని గాజు బొమ్మల్లాగా ట్రీట్ చేస్తున్నారు. పిల్లలు అడిగిన బొమ్మలన్నీ కొనిపెడుతూ ఉంటారు. అయితే.. పిల్లలు మారాం చేశారు కదా.. అడిగారు కదా, ఏడ్చారు కదా అని మాత్రం కొన్ని బొమ్మలు మాత్రం అస్సలు కొనడదట.  పొరపాటున కూడా పేరెంట్స్ పిల్లలకు కొనకూడని బొమ్మలు ఏంటో ఓసారి చూద్దాం…

1.చీప్ ప్లాస్టిక్ టాయ్స్..

మనం కారులో వెళ్తుంటేనే లేక..ఇంకెక్కడైనా చాలా తక్కువ ధరకే కొందరు  ప్లాస్టిక్ టాయ్స్ కొంటూ ఉంటారు. అవి ధరలో చాలా తక్కువగా ఉంటాయి. వాటిని చూడగానే పిల్లలు కావాలని మారం చేస్తారు. దీంతో… వాళ్లను ఏడిపించడం ఎందుకులే.. డబ్బులు కూడా ఎక్కువ కాదు కదా అని కొనేస్తూ ఉంటారు. కానీ.. అలాంటి చీప్ ప్లాస్టిక్ టాయ్స్ ని  కొనివ్వకూడదట. ఎందుకంటే వాటి తయారీకి వాడే మెటీరియల్ పిల్లలకు అనారోగ్య సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది.


2.గ్యాడ్జెట్స్, ఎలక్ట్రికల్ టాయ్స్…

ఇక.. పిల్లలకు కాస్ట్ లీ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రికల్ టాయ్స్ కూడా పొరపాటున కూడా కొనివ్వకూడదు. మనం డబ్బు సంపాదించేది పిల్లల కోసమే కదా.. కొనిస్తే ఏమౌతుంది అని, ప్రేమ ఎక్కువై కనుక ఈ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రికల్ టాయ్స్ కొనిపెట్టారంటే.. పిల్లల జీవితం నాశనం చేసినవారు అవుతారు. వాటికి పిల్లలు బానిసలుగా మారిపోతారు. వీటి వల్ల లాభం ఎంత ఉందో.. నష్టం కూడా అంతే ఉంటుంది. పిల్లలకు మంచి నిద్ర లేకపోవడం, కంటి చూపు లో సమస్య రావడం లాంటి చాలా నష్టాలు ఉన్నాయి.

3.కాస్ట్యూమ్ జ్యూవెలరీ…

పిల్లలకు ఖరీదైన జ్యూవెలరీ పెట్టలేం కదా..అని.. కాస్ట్యూమ్స్ జ్యూవెలరీ పెడుతూ ఉంటారు. పూసలు, బీడ్స్ ఉండే జ్యూవెలరీ పెడుతూ ఉంటారు. కానీ.. ఇవి కూడా పిల్లలకు ఇవ్వకూడదట. వీటి వల్ల కూడా పిల్లలకు సమస్యలు వచ్చే అవకాశం ఉందట. వాటిని నోట్లో పెట్టుకోవడం వల్ల, లేక వాటిలో ఏదైనా పదునుగా ఉంటే.. నోట్లో గుచ్చుకోవడం లాంటి ప్రమాదం ఉంది. మరీ, చిన్న పిల్లలకు ఇలాంటివి ఇవ్వకూడదు.

4.షుగరీ ఫుడ్స్…

బొమ్మలు మాత్రమే కాదు.. కొన్ని రకాల ఫుడ్స్ కూడా పిల్లలకు పేరెంట్స్ కొనివ్వకూడదట. వాటిలో షుగర్, బేకరీ, మైదా ఫుడ్స్, కూల్ డ్రింక్స్  ముందు వరసలో ఉంటాయి. మనం ఎంత వద్దు అన్నా.. పిల్లలకు అలాంటి ఫుడ్సే బాగా నచ్చుతాయి. కానీ.. ఎప్పుడో ఒకసారి కొనిపెడితే పర్వాలేదు కానీ.. రెగ్యులర్ గా ఇలాంటివి అందించకూడదు.

5. చిన్నవి, పదునైనవి..

పిల్లలు ఎలాంటి వస్తువు అయినా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. మనం ఇచ్చే టాయ్స్ లో చిన్నవి ఉంటే.. వాటిని మింగే ప్రమాదం ఉంది. అదేవిధంగా పదునైన వస్తువులు కూడా ఇవ్వకూడదు. గాయాలు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఇలాంటివి కొనివ్వకూడదు.

video game 1

6.హింసను ప్రేరేపించే వీడియో గేమ్స్…

మనం పిల్లలకు వీడియో గేమ్స్ కొనిపెడుతూ ఉంటాం. అయితే.. అందులో వాళ్లు ఎలాంటి  గేమ్స్ ఆడుతున్నారని కూడా చూడాలి. హింసును ప్రేరేపించే గేమ్స్ ఆడకుండా చూసుకోవాలి. అంటే చంపడం లాంటివి ఉండకూడదు. ఇవి పిల్లల బ్రెయిన్ ని చాలా వరకు ఎఫెక్ట్ చేస్తాయి.

7.దుస్తులు…

ప్రతి పేరెంట్స్ తమ పిల్లలు అందరికంటే గొప్పగా కనపడాలి అనుకుంటారు. దాని కోసం కాస్త ఖరీదైన దుస్తులు కొంటూ ఉంటారు. కానీ.. మీరు కొనే దుస్తులు ధర కాకుండా.. వారి కంఫర్ట్ చూడటం చాలా ముఖ్యం. పిల్లలకు కంఫర్ట్ లేని దుస్తులు వేయకూడదు. 

Latest Videos

click me!