సమ్మర్ లో పిల్లలను టీవీ, ఫోన్ లేకుండా ఎంగేజ్ చేయడం ఎలా..?

First Published | Apr 24, 2024, 1:34 PM IST

 ఒక వారం రోజులు పిల్లలను అమ్మమమ్, నానమ్మ ఇంటికి పంపొచ్చు. అంతకు మించి ఎక్కువ రోజులు కూడా పంపలేం. అలాంటి వారికి ఇంట్లోనే ఫన్ యాక్టివిటీస్ క్రియేట్ చేయాలి.

ఎండాకాలం వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. అన్నీ స్కూళ్లు సెలవలు ప్రకటించేశాయి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత  కాసేపు భరించడమే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది.. ఇప్పుడు సెలవలు రెండు, మూడు నెలలు భరించడం మరింత కష్టంగా ఉంటుంది. ఇక పిల్లలు కూడా  ఇంట్లో ఉన్నంతసేపు.. టీవీ, ఫోన్, ట్యాబ్ కావాలని మారాం చేస్తూ ఉంటారు.  ఎంత మారాం చేసినా.. కాసేపటి వరకు అయితే కంట్రోల్ చేయగలం కానీ... రోజంతా అంటే కష్టంగా ఉంటుంది. అయితే... అలాంటి పిల్లలకు ఈ సమ్మర్ లో... ఫోన్ లు, టీవీలు  లేకుండా పిల్లలను ఎలా ఎంగేజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం...

kids

సమ్మర్ లో పిల్లలను బయటకు తీసుకువెళ్లడం అంటే.. ఒకటి రెండు రోజులు అంటే,. ఆడుకోవడానికి తీసుకువెళ్లొచ్చు. ఒక వారం రోజులు పిల్లలను అమ్మమమ్, నానమ్మ ఇంటికి పంపొచ్చు. అంతకు మించి ఎక్కువ రోజులు కూడా పంపలేం. అలాంటి వారికి ఇంట్లోనే ఫన్ యాక్టివిటీస్ క్రియేట్ చేయాలి.

రోజూ సాయంత్రం ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ లాంటి ప్రదేశాలకు తీసుకువెళ్లండి. అక్కడ పిల్లలు ఉసయోగపడే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. వాటిని కాసేపు ఆడుకునేలా చేయాలి. ఇవి సరదాగా ఉంటాయి.. బాడీ ఫిట్ గా ఉండటానికి కూడా సహాయపడతాయి. వారి వయసు కి తగిన వాటిని మాత్రమే ఆడించాలి.


kids

పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వారితో సమయం గడపడానికి ప్రయత్నించాలి. వారిని ఊరికే వదిలేయకుండా.. వారితో బోర్డ్ గేమ్స్ ఆడించాలి. అయితే... ఎప్పుడూ ఉన్న గేమ్స్ ఆడాలంటే బోర్ గా అనిపించొచ్చు. అలాంటప్పుడు. కొత్త గేమ్స్ ఆడించాలి. స్పిన్  ద వీల్, బాటిల్ ఫ్లిప్ లాంటి గేమ్స్ ఆడిస్తే... చాలా సరదాగా ఉంటుంది.

దాదాపు పిల్లలు అందరికీ హాలీడేస్ కాబట్టి.. కజిన్స్, మీ ఫ్రెండ్స్ పిల్లలు అందరినీ ఒక చోట చేర్చి... వారికంటూ స్పెషల్ గా  పార్టీ ఏర్పాటు చేయాలి. వారికి నచ్చిన పాటలు మ్యూజిక్ ఏర్పాటు  చేసి... వారికి నచ్చిన ఫుడ్ ఏర్పాటు చేసి... వారిని ఎంజాయ్ చేయమని చెప్పాలి. ఆ సమయంలో వారికి ఫోన్లు, టీవీలు దూరంగా ఉంచాలి.  అందరితో కలిసి ఉన్నప్పుడు పిల్లలు ఒకరిని చూసి మరొకరు ఇష్టంగా తింటారు.


ప్రతి పిల్లల దగ్గర క్రేయాన్స్ ఉంటాయి. వాటితో కలరింగ్ చేయడం పిల్లలకు కాస్త బోరింగ్ గా అనిపిస్తే.. ఆ క్రేయాన్స్ ని కరిగించి.. క్యాన్వాస్ మీద పెయింటింగ్ చేయడం అలవాటు చేయండి. వారికి అది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆసక్తి కూడా పెంచుతుంది. వారికి నచ్చింది ఏదైనా వేయమని చెప్పండి.

బుక్ రీడింగ్..
పిల్లలను శారీరంగా ఫిట్ గా ఉంచడమే కాదు.. మానసికంగానూ స్ట్రాంగ్ గా ఉంచే ప్రయత్నం  చేయాలి. దాని కోసం మారి మానసిక ఉల్లాసం పెంపొందించడడానికి మంచి పుస్తకాలు చదివించాలి. బుక్ రీడింగ్ చాలా మంచి అలవాటు. దానివైపు పిల్లల ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించడం చాలా మంచిది. దీనిపై మీరు ఫోకస్ పెట్టండి. వారికి ఆసక్తి కలిగించేలాంటి పుస్తకాలు కొని ఇవ్వండి.
 

వాకింగ్..
ఇప్పుడంటే పిల్లలు రోజూ స్కూల్ కి వెళ్తుంటారు కాబట్టి.. ఉదయం లేవడం, హడావిడిగా తయారవ్వడం, తినీ తినక స్కూల్ కి పరిగెత్తడం చేస్తూ ఉంటారు. సమ్మర్ హాలీడేస్ వచ్చిన తర్వాత ఆ హడావిడి ఉండదు. కాబట్టి.. ప్రశాంతంగా ఉదయాన్నే వారిని లేపి.. చక్కగా నేచర్ లో వాకింగ్ కి తీసుకువెళ్లండి. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారు. చుట్టూ పరిసరాలు తెలుసుకుంటారు. ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

ఇక పిల్లలకు కుకింగ్ కూడా నేర్పించవచ్చు. ముందుగా ఫైర్ లెస్ కుకింగ్ నేర్పించాలి. కొంచెం పెద్ద పిల్లలు అయితే.. వారి బ్రేక్ ఫాస్ట్ వారే తయారు చేసుకునేలా అలవాటు చేయండి.

Latest Videos

click me!