తమ పిల్లల బ్రెయిన్ చురుకుగా ఉండాలని, వారికి చాలా తెలివి తేటలు ఉండాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. అందుకోసం పిల్లలను ఏవేవో కోర్సుల్లో చేర్పిచడం, ఎక్కువ చదివించడం లాంటివి చేస్తూ ఉంటారు. స్కూల్లో వచ్చే మార్కులతో పిల్లల తెలివితేటలను కొలమానం వేస్తూ ఉంటారు. తమ పిల్లలకు మార్కులు మంచిగా రావాలని స్కూల్లో టీచర్స్ ని ఫ్రెజర్ చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు. కానీ.. ఆ మార్కులకు, తెలివితేటలకు సంబంధం లేదు అనే విషయం పేరెంట్స్ కి తెలుసుకోవాలి.
school holiday
కేవలం స్కూల్ కి వెళ్లిన సమయమే కాదు.. స్కూల్ ని వచ్చిన తర్వాత.. లేదంటే.. ఈ సమ్మర్ హాలీడేస్ లో.. మనం పిల్లలతో కొన్ని పనులు చేయిస్తే.. వారి మెదడు చాలా చురుకుగా తయారౌతుంది. దాని కోసం పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్నాయి కదా.. ఇంటికి వచ్చిన తర్వాత వారికి భోజనం పెట్టి.. కాసేపు నిద్రపుచ్చాలి. నిద్ర అంటే మరీ గంటలు గంటలు కాదు కానీ.. కనీసం 20 నుంచి 30 నిమిషాలు నిద్రపోనివ్వాలి. ఇలా పడుకోవడం వల్ల.. వారి బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి శ్రద్ధ కూడా ఎక్కువ పెడుతూ ఉంటారు.
puzzle game
పిల్లలకు తరచూ పజిల్స్ చేయిస్తూ ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల పజిల్స్, షేప్స్, కలర్స్ అందుబాటులో ఉంటున్నాయి. అవి పిల్లలకు సరదగా అనిపిస్తూ ఉంటాయి.అదేవిధంగా మెదడుకు పదును పెట్టేలా కూడా ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి బుర్ర ఎక్కువ వాడతారు. దాని వల్ల కూడా బ్రెయిన్ చాలా షార్ప్ గా పని చేయడం మొదలుపెడుతుంది.
ఇక పిల్లలకు పుస్తకాలు చదివే ఆసక్తి పెంచాలి. ముందుగా బొమ్మలు ఉండేలా పుస్తకాలు ఇస్తూ చదివేలా ప్రోత్సహించాలి. తర్వాతర్వాత.. మంచి మంచి కథల పుస్తకాలు చదివించాలి. ఈ పుస్తకాలు చదవడం వల్ల కూడా.. బ్రెయిన్ బాగా పని చేయడం మొదలుపెడుతుంది.
Panting coloring
ఇక.. పిల్లలతో క్రియేటివిటీని పెంచే పనులు చేయించాలి. వారికి నచ్చిన బొమ్మలు వేయమని చెప్పడం, కలరింగ్ చేయించడం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాంటివి చేయించాలి. వీటి వల్ల కూడా పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది.
ఇక ఎప్పుడూ పిల్లలను చదువమని ఒత్తిడి చేయకూడదు. ఆటలు కూడా ఆడించాలి. దానికి ఇంట్లోనే వారితో బోర్డ్ గేమ్స్ ఆడించాలి. చెస్, క్యారమ్స్ మాత్రమే కాదు.. లూడో, మోనోపోలీ లాంటివి కూడా ఆడించాలి. ఇవి కూడా పిల్లల మెదడు చురుకుగా పని చేసేలా చేస్తుంది.
ఇక.. పిల్లలకు జనరల్ నాలెడ్జ్ మీద ఫోకస్ పెట్టేలా చేయాలి. సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీలకు సంబంధించిన విషయాలను నేర్పించాలి. పిల్లలకు.. వీటిని నేర్పించి.. ఆ ప్రశ్నలను పిల్లలకు ఇవ్వాలి.. వాటికి సమాధానాలు రాయమని మీరే అడగాలి. వీటి వల్ల కూడా మెదడు చురుకుగా పని చేస్తుంది.
వీటితో పాటు.. పిల్లలతో సుడోకు వంటి గేమ్స్ కూడా ఆడించాలి. ఈ ఆటలు కూడా పిల్లల్లో లాజికల్ థింకింగ్ పెంచేలా సహాయం చేస్తాయి. ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి.