తల్లి అవ్వడం అనేది ఒక వరం. పెళ్లైనప్రతి స్త్రీ.. తల్లి కావాలని ఆశపడుతుంది. అయితే.. చాలా మందికి బిడ్డ పుట్టిన తర్వాత... ఎక్కువగా పాలు రావు. మొదటి రెండు, మూడు నెలలు పాలు ఉన్నట్లే అనిపించినా.. ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. దీంతో.. ఆకలి తీరక బిడ్డ ఎక్కువగా ఏడుస్తూ ఉంటాడు. అయితే.. బిడ్డ పుట్టిన తర్వాత నుంచి వైద్యులు చెప్పిన కొన్ని సూచనలు పాటిస్తే.. కచ్చితంగా పాలు పెరుగుతాయి. మరి దానికోసం తల్లులు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
తల్లి పాలు ఎక్కువగా రావాలి అంటే.. ముందు మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. పాలు ఇచ్చే సమయంలోనూ వాటర్ బాటిల్ పక్కనే పెట్టుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటే పాలు ఎక్కువగా వస్తాయి. అంతేకాదు.. పాలు ఇచ్చేటప్పుడు ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. అందుకే వాటర్ తాగుతూ ఉండాలి.
చాలా మంది తల్లీ, బిడ్డలను పక్క పక్కన పడుకోపెట్టరు. బిడ్డను ఎక్కువ సేపు అమ్మమ్మ, నానమ్మల దగ్గరే ఉంచుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. బిడ్డను తల్లి పక్కనే ఉంచాలి. బిడ్డను చూడటం, బిడ్డ వాసన, బిడ్డ ఏడుపు వల్ల కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది.
breast feeding
ఇక.. చాలా మంది బిడ్డ పుట్టిన కొద్ది రోజుల వరకు బాటిల్ పాలు పట్టిస్తారు. ఆ పొరపాటు అస్సలు చేయకూడదు. ఒక్కసారి బిడ్డకు బాటిల్ పట్టుకోవడం అలవాటు అయితే.. తల్లి రొమ్ము పట్టుకొని తాగరు. కాబట్టి.. మొదటి రెండు రోజులు కాస్త కష్టమైనా పాలు వచ్చినా రాకున్నా.. రొమ్ము దగ్గరే పాలు తాగించే అలవాటు చేయాలి. రొమ్ము పాలు అలవాటు అయ్యే వరకు బాటిల్ కాకుండా... పాలు ఎక్స్పైస్ చేసే స్పూన్ తో పట్టించొచ్చు. పిల్లలు పాలు తాగుతూ ఉంటే.. ఇంకా పాలు పెరుగుతూ ఉంటాయి అని గుర్తు పెట్టుకోండి.
breast feeding
డెలివరీ అయిన వెంటనే.. బిడ్డకు తల్లి దగ్గర పాలు పట్టించాలి. ఎంత తొందరగా తాగిస్తే అంత తొందరగా పాలు వస్తాయి. ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి పాలు పట్టిస్తూ ఉండాలి. ఇలా చేస్తే.. పాలు వస్తూ ఉంటాయి. బిడ్డకు కూడా చక్కగా సరిపోతాయి.
ఇక.. బిడ్డ పాలు తాగేసమయంలో ఒకవైపు రొమ్ము పూర్తిగా ఖాళీ అయ్యిన తర్వాతే.. రెండో వైపు రొమ్ముకి పాలు పట్టించాలి. ఎందుకంటే.. ముందు వచ్చే పాలు నీళ్లలా ఉంటాయి. అవి కేవలం దాహం తీరుస్తాయి. తర్వాత వచ్చేవి చిక్కగా ఉంటాయి.. అవి ఆకలి తీరుస్తాయి. ఇక బిడ్డ పాలు తాగిన ప్రతిసారీ.. రెండు వైపులా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండాలి.