ఇదొక్కటి చేసినా మీ పిల్లలు బాగా హైట్ పెరుగుతారు

First Published | Sep 15, 2024, 11:55 AM IST

కొంతమంది పిల్లల వయసు పెరిగినా.. హైట్ మాత్రం పెరగరు. కానీ ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. అయితే కొన్ని సహజ పద్దతుల్లో కూడా మీ పిల్లల హైట్ ను పెంచొచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే? 

height


కొంతమంది పిల్లలు వయసుకు తగ్గట్టు హైట్ పెరిగినా.. మరికొంతమంది పిల్లలు మాత్రం అలాగే పొట్టిగానే ఉంటారు.ఈ పిల్లలకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతాయి. ఇంట్లో వాళ్ల నుంచి ఇరుగుపొరుగు వాళ్లు, స్కూల్ ఫ్రెండ్స్, బంధువులు ఇలా ప్రతి ఒక్కరూ పొట్టి పొట్టి అని వెక్కిరిస్తుంటారు. కానీ ఇది పిల్లలను మానసికంగా ఇబ్బంది పెడుతుంది. 


అయితే ఇంట్లో వారిని బట్టి కూడా పిల్లలు పొట్టిగా లేదా పొడవుగా ఉంటారు. అంటే ఇంట్లో ఎవరైనా హైట్ గా ఉంటే.. వారి హైట్ బాగా పెరుగుతారు. పొట్టిగా ఉంటే పొట్టిగా అవుతారు. అంటే జన్యుపరంగా కూడా పిల్లలు పొట్టిగా అయ్యే అవకాశం ఉందన్న మాట. 

చాలా వరకు 1 సంవత్సరం నుంచి యుక్తవయస్సు వరకు ప్రతి ఏడాది పిల్లలు 2 అంగుళాలు పెరుగుతుంటారు. ఇక 18 సంవత్సరాల వయస్సు వరకు వీళ్లు 4 శాతం చొప్పున పెరుగుతారు. ఆ తర్వాత పెరుగుదల తగ్గుతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది.

ఈ 18 సంవత్సరాల తర్వత పిల్లల హైట్ ను పెంచొచ్చా? అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. కానీ కొన్ని చిట్కాలను మీరు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని అంగుళాల ఎత్తును పెంచొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


సరైన పోషణ,  ఆరోగ్యకరమైన జీవనశైలి

తినే ఫుడ్ కేవలం ఆరోగ్యాన్నే కాదు ఎత్తును కూడా ప్రభావితం చేస్తుంది. మీ పిల్లలు హైట్ పెరగాలంటే మాత్రం వారికి సరైన పోషకాహారం ఇవ్వాలి. అలాగే వారి జీవనశైలిని ఆరోగ్యంగా ఉంచాలి. ఇవి వారి హైట్ ను ప్రభావితం చేయడంలో ఎంతో సహాయపడతాయి. 

నిపుణులు ఏమంటున్నారంటే?

18 ఏండ్ల తర్వాత ఎత్తు పెరగడం చాలా కష్టం. ఇంతకంటే తక్కువ వయసులోనే పిల్లలు హైట్ పెరుగుతారు. కానీ సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే మాత్రం 18 సంవత్సరాల తర్వాత కూడా హైట్ పెరుగుతారు. కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ తో పాటుగా సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీ హైట్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

కాల్షియం

ఎముకలను బలంగా ఉంచడానికి కాల్షియం చాలా అవసరం. ఇది మీ హైట్ ను పెంచడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం పాలు, ఆకుపచ్చ కూరగాయలు, పాల ఉత్పత్తులను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి. 

విటమిన్ డి

కాల్షియంలో పాటుగా విటమిన్ డి కూడా ఎముకలను బలంగా చేయడానికి సహాయపడుతుంది. సూర్యరశ్మి ద్వారా మీ శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. ఇందుకోసం మీరు ప్రతిరోజూ ఉదయం 15-20 నిమిషాల పాటు ఎండలో కూర్చోండి. అలాగే గుడ్లు, చేపలు, తృణధాన్యాలను తినండి. 

ప్రోటీన్

కండరాలు పెరగడానికి ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం మీరు మీ రోజువారి ఆహారంలో మాంసం, బీన్స్, చిక్కుళ్లను చేర్చుకోండి. ఇది మీ హైట్ ను బాగా పెంచడానికి సహాయపడుతుంది. 
 

సప్లిమెంట్స్

మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా విటమిన్లు, ఖనిజాలు ఉండాలి. ఇవే మీరు ఆరోగ్యంగా ఉండటానికి, మీరు హైట్ పెరగడానికి బాగా సహాయపడుతుంది. అయితే చాలా సార్లు మీరు తినే ఆహారంలో మీ శరీరానికి అవసరమైన పోషకాలు ఉండకపోవచ్చు. కాబట్టి మీ శరీర అవసరాలను తీర్చడానికి మీ ఆహారంలో సప్లిమెంట్లను చేర్చండి. సింథటిక్ హెచ్జిహెచ్, విటమిన్ డి లేదా కాల్షియం వంటి సప్లిమెంట్స్ మీ హైట్ ను కొన్ని అంగుళాలు పెంచడానికి సహాయపడతాయి. 

జింక్ లోపం 

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం జింక్. ఇది మీ శరీరంలో తక్కువగా ఉంటే కూడా మీరు హైట్ పెరగరు. విత్తనాలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే మీ పిల్లలు ఖచ్చితంగా హైట్ పెరుగుతారు. 

హైడ్రేటెడ్ గా ఉండండి

మన శరీరానికి వాటర్ చాలా అవసరం. ఇది కణాలు పెరగడానికి బాగా సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని బలంగా ఉంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ 2-3 లీటర్ల నీళ్లను తాగండి. అలాగే మీ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి.
 


వ్యాయామం 

వ్యాయామం వల్ల కూడా మన  శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో మీ హైట్ ను పెంచడం కూడా ఉంది. మీరు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. మీ కండరాలు, ఎముకలు బలంగా ఉంటాయి. మీ బరువు కూడా అదుపులో ఉంటుంది.

చిన్నప్పటి నుంచి శారీరకంగా చురుకుగా ఉంటే మీరు ఖచ్చితంగా హైట్ పెరుగుతారు. బలాన్ని పెంచే వ్యాయామాలు, యోగా, జంపింగ్ రోప్ వంటివి కొన్ని అంగుళాల ఎత్తును పెంచడానికి సహాయపడతాయి.
 

Latest Videos

click me!