పిల్లల పెంపకంలో ఏ లోపమూ ఉండకూడదనుకుంటే తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే. !

First Published | Apr 3, 2024, 3:40 PM IST

నేటి పిల్లలు మరింత సున్నితంగా, హైపర్ యాక్టివ్ గా ఉన్నారు. దీంతో వాళ్లను హ్యాండిల్ చేయడం తల్లిదండ్రులకు కష్టంగా మారింది. మొబైల్, టీవీ, ఇంటర్నెట్ ఉన్న ఈ కాలంలో పిల్లలను పెంచడానికి పాత పద్ధతులు పనిచేయవు. కానీ పిల్లల సరైన ఎదుగుదలకు ప్రభావవంతమైన కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే? 
 

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులకు పిల్లలను పెంచడం చాలా కష్టంగా మారింది. ఈ మాటను పెద్దల నోటి నుంచి మీరు కూడా చాలా సార్లు వినే ఉంటారు. నిజానికి ఒకప్పుడు పిల్లల అవసరాలు తీర్చడం తల్లిదండ్రుల పనిగా భావించేవారు. అలాగే అప్పుడు పిల్లల పెంపకం ఇంత కష్టంగా ఉండేది కాదంటా. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత బాగా పెరిగిపోయింది. అందుకే దీన్ని చాలా మంది తల్లిదండ్రులు సవాలుగానే భావిస్తున్నారు. 
 


నేటితరం పిల్లల్ని పెంచడం పెద్ద పనిగా అయ్యింది తల్లిదండ్రులకు. ఎందుకంటే పెంపకంలో ఏ చిన్న పొరపాటు జరిగినా భవిష్యత్తు కలలను ఛిన్నాభిన్నం అవుతాయి. అందుకే పిల్లల పెంపకానికి సంబంధించిన కొన్ని నియమాలను తప్పక పాటించాలి. దీనివల్ల మీ పిల్లలను మంచి మనుషులుగా మార్చడమే కాకుండా..  వారు మీపై వేలు ఎత్తిచూపే అవకాశం కూడా ఉండదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


ప్రేమ, మొండితనం మధ్య వ్యత్యాసం

ప్రేమకు, మొండితనానికి మధ్య తేడాను మీ పిల్లలకు వివరించండి. అయితే పిల్లలు మొండిగా చేసిన ఏదైనా అడిగినప్పుడు తల్లిదండ్రులు ఇప్పించకపోతే మా పేరెంట్స్ కు మేమంటే ఇష్టం లేదని అనుకుంటారు. అందుకే పిల్లలకు మొండితనానికి, ప్రేమకు మధ్య తేడాను అర్థమయ్యేట్టు చెప్పండి. వారు అడిగిందల్లా ఇప్పించకుండా వారికి అవసరమైనవి ఇప్పించండి. 
 


ఇంట్లో క్రమశిక్షణ కూడా అవసరం

క్రమశిక్షణ అనేది కేవలం పాఠశాల లేదా ట్యూషన్ కు మాత్రమే పరిమితమని చాలా మంది పిల్లలు అనుకుంటారు. కానీ పిల్లలకు క్రమశిక్షణ ఇంట్లో కూడా అవసరమే. పిల్లలు అల్లరి చేస్తుంటే.. వారిని గేమ్స్ ఆడమని చెప్పండి. పిల్లలతో మీరు కూడా ఆడండి. చదువుకోమని కూడా చెప్పండి. ప్రతిదానికీ ఒక సమయం ఉంటుందని వారికి అర్థమయ్యేలా చేయండి. వారిని పదేపదే కొట్టడం లేదా తిట్టే తప్పు చేయకండి. ఇలా చేస్తే వారికి చిరాకు కలుగుతుంది. మొండిగా కూడా ప్రవర్తిస్తారు. 
 

ప్రశ్నించడం తప్పుకాదు

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ప్రశ్నలు అడిగే కొడుతుంటారు. లేదా మాట్లాడనివ్వరు. కానీ ఇది మీ పిల్లల అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు. ప్రశ్న ఏదైనా సరే దానిని గుర్తుంచుకోవడం కంటే మీతో పంచుకోవడం మంచిదని వారికి చెప్పండి. పిల్లలు తలవంచుకుని లేదా భయంతో ప్రతిదీ పాటిస్తే వారి అభివృద్ధి కూడా ఆగిపోతుంది.
 

parenting


మీరే నిర్ణయాలు తీసుకోనివ్వండి

పిల్లల మంచి పెంపకం కోసం వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పడం అవసరం. ఇందుకోసం వారితో మాట్లాడండి. పిల్లలకు ఈ అలవాటును నేర్పడం వల్ల పిల్లలు మోసాలు, బాధల నుంచి రక్షించబడతారు. ఇది ఇతరుల కంటే మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే జీవితంలోని ప్రతి చెడు అంశంపై  మీ పెంపకాన్ని గుర్తుంచుకుంటారు.

Latest Videos

click me!