పిల్లలు తప్పు చేసినప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి..?

First Published Apr 1, 2024, 11:07 AM IST

వారు చేసింది తప్పు అని.. ఇంకోసారి చేయకుండా ఉండాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలి..? పిల్లలు.. తమ తప్పులను సరిద్దుకోవాలంటే.. పేరెంట్స్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
 

పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే.. తప్పులు , పొరపాట్లు చేయడం చాలా సహజం. పెద్దవారు చేస్తే.. వారే ఆ తప్పు తెలుసుకుంటారు. కానీ పిల్లలు అలా కాదు.. పాపం వారు  చేసింది తప్పు అనే విషయం కూడా వారికి తెలీదు. కానీ పేరెంట్స్ కి తెలుస్తుంది కదా.. వెంటనే మందిలిస్తారు. లేదంటే పనిష్మెంట్ ఇస్తారు. తప్పు చేసిన ప్రతిసారీ పిల్లలను కొట్టే పేరెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే.. పిల్లలును అలా కొట్టకూడదు. మరి.. వారు చేసింది తప్పు అని.. ఇంకోసారి చేయకుండా ఉండాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలి..? పిల్లలు.. తమ తప్పులను సరిద్దుకోవాలంటే.. పేరెంట్స్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
 


1. పిల్లలు కూడా.. కావాలని తప్పులు చేయకపోవచ్చు. వారు కూడా పొరపాట్లు చేయవచ్చు. వాటిని మనం బూతద్దంలో చూసి తిట్టడం, కొట్టడం చేయకూడదు. ఉదాహరణకు వారి చేతిలో నుంచి ఓ వస్తువు చేజారింది అనుకోండి... వెంటనే పేరెంట్స్ రియాక్ట్ అయిపోతారు. కొంచెం కూడా జాగ్రత్తగా ఉండలేవా? ఆ మాత్రం కూడా పట్టుకోలేవా అని తిడతారు. లేదంటే ఇంకాస్త కోపమొస్తే కొట్టేస్తారు. కానీ... రియాక్ట్ అవ్వద్దు.. రెస్పాండ్ అవ్వాలి. పిలిచి.. కింద పడిన దానిని ఇద్దరం కలిసి క్లీన్ చేద్దామని పిలవాలి. అలా క్లీన్ చేస్తున్న సమయంలో వస్తువు విలువ ఏంటి..? అది పాడవ్వడం వల్ల జరిగిన నష్టం ఏంటి..? అనేది వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి. అప్పుడు మరోసారి వారు ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్తపడతారు.

2.ఇక కొందరు పిల్లలు తాము తప్పు చేసి కూడా.. ఆ తప్పు చేసింది తాము కాదు అనేస్తూ ఉంటారు. తమ తోబుట్టువులపై నెట్టేస్తారు. ఎందుకు అంటే.. పిల్లలు.. తమను ఎవరైనా తప్పుగా అనుకుంటే ఇబ్బంది పడతారు. అందుకే.. దానిని కప్పిపుచ్చుకోవడానికి తాము చేయలేదనో.. ఇతరులపై నెట్టడమో చేస్తూ ఉంటారు.
 

3. అలా తాము చేయలేదు అని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజమేనని పేరెంట్స్ నమ్మడం మొదలుపెడితే.. ఇక వారు దానిని అలవాటుగా మార్చుకుంటారు. ప్రతిసారీ తప్పుచేయడం.. ఇతరులపై తోసేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారుతుంది. కాబట్టి.. దానిని పేరెంట్స్ ఆదిలోనే గుర్తించి.. ఆ అలవాటును దూరం చేసే ప్రయత్నం చేయాలి.

4. అయితే.. పిల్లలు చేసిన తప్పులను పేరెంట్స్ సరిచేస్తూ పోకూడదు. దాని వల్ల.. వారు ఎప్పటికీ ఆ తప్పును తెలుసుకోలేరు. వారి తప్పును కవర్ చేసే ప్రయత్నం చేయవద్దు.  అది వారి జీవితాన్ని నాశనం చేసేస్తుంది.  దానికి బదులుగా మీరు.. వారు చేసిన తప్పులను వారే సరి చేసేదెలాగో నేర్పించాలి. అప్పుడు వారికి లైఫ్ లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పులు చేయకుండా ఉంటారు.
 

kids foods

5.ఇక పిల్లలు తప్పు చేసినప్పుడు  వెంటనే పేరెంట్స్ ని క్షమాపణలు చెప్పమని అడుగుతారు. మొదట్లో పిల్లలు కాస్త ఇబ్బంది పడినా.. తర్వాత క్షమాపణలు చెబుతారు. దాని వల్ల.. తప్పు చేస్తే.. ఒక్క క్షమాపణ చెబితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఆ తప్పులు  చేయడం, సారీ చెప్పడం ఇంట్లో నార్మల్ గా మారిపోతుంది. అంతేకానీ.. వాళ్లు తప్పులు చేయడం ఆపరు.

6.చాలా మంది పేరెంట్స్ పిల్లలు తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా వెంటనే వారిపై అరవడం, కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. పిల్లలకు ఇంట్లో సురక్షితమైన వాతావరణాన్ని అందించాలి. ఓవర్ గా రియాక్ట్ అవ్వడం,విమర్శించడం, శిక్షంచడం చేయకూడదు. అది పిల్లల మనసులను గాయపరుస్తుంది. దానికి బదులు.. సున్నితంగా వారు చేసిన తప్పు ఎక్కడిదాకా దారి తీస్తుంది అనే విషయాన్ని తెలియజేయాలి.

7.పిల్లల ప్రవర్తనను లేబుులింగ్ చేయడం కూడా అంత మంచిది కాదు. ముఖ్యంగా.. బ్యాడ్ అని.. ఎప్పుడూ తప్పులే చేస్తారు అని చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి.. ఒక్కసారి తప్పు చేసినంత మాత్రాన వారు ప్రతిసారీ తప్పులు మాత్రమే  చేస్తారు అని లేబులింగ్ చేయడం మానేయాలి. పిల్లలను బూతులతో తిట్టడం లాంటివి చేయకుండా.. సున్నితమైన భాషలో వారు  చేసిన తప్పు వల్ల కలిగే నష్టం ఏంటో వారికి తెలియజేయాలి.

8. పిల్లలు తప్పు చేసినప్పుడు తిట్టి.. మంచి చేసినప్పుడు మాత్రం పొగడరు. ఒక్కసారి పొగిడితే.. నెత్తిన ఎక్కి కూర్చుంటారు అని అనుకుంటారు. కానీ.. వారు నిజాయితీగా ఏదైనా మంచి పని చేసినప్పుడు మన స్పూర్తిగా అభినందించడం కూడా పేరెంట్స్ కి తెలిసి ఉండాలి.

click me!