ఎండాకాలం వచ్చిందంటే చుండ్రు, జుట్టు పొడిబారడం, రాలడం, తల దురద లాంటి సమస్యలు వస్తాయి. మన పరిస్థితి ఇలా ఉంటే, పిల్లల గురించి మాట్లాడుకుందాం. వేసవి ఎండలకు పిల్లల సున్నితమైన జుట్టు తీవ్రంగా ప్రభావితమవుతుంది. జుట్టు రాలడం, పొడిబారడం, జుట్టు చిట్లడం వంటి ప్రభావాలు వస్తాయి. కాబట్టి, పిల్లల జుట్టు పాడవ్వకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి.