కూతుర్లకి తల్లిదండ్రులు ఏం చెప్పకూడదో తెలుసా?

First Published | Sep 21, 2024, 1:02 PM IST

కాలం మారుతున్నా.. చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని, మగపిల్లల్ని వేరుగానే చూస్తున్నారు. అయితే ప్రతి తల్లిదండ్రులు తమ కూతుర్లకు కొన్ని విషయాలను అస్సలు చెప్పకూడదు. ఒకవేళ చెప్తే ఏమౌతుందో తెలుసా? 
 

వేరేవాళ్లు ఏమనుకుంటారు

సామాజిక వ్యతిరేకత, ఎన్నో అవరోధాలను, సమస్యలను ఎదుర్కొని ఆడపిల్లలు తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. మగాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. అందుకే మీ కూతుర్లు ఏదైనా పని చేసేటప్పుడు వేరేవాళ్లు, సమాజం ఏమనుకుంటుందో అని వారికి అడ్డు చెప్పకండి. తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలకు అడ్డంకి కాకూడదు. 
 

అమ్మాయిలా ప్రవర్తించండి

ఇవి అబ్బాయిలు చేసే పనులు, అమ్మాయిలు చేసే పనులు వేరే ఉంటాయని అమ్మాయిల్ని విమర్శించకండి. తండ్రి సంగతి పక్కన పెడితే తల్లులు కూడా తమ కూతుర్లను చాలా సార్లు ఈ మాట అంటుంటారు. ఎదగడం కోసం బయటకు వెళ్లే మహిళల స్వేచ్ఛను పరిమితం చేయకండి. వారి ఫ్యూచర్ ను పాడు చేసినవారవుతారు.
 


మా కాలంలో ఇలా ఉండేది కాదు

కాలం మారుతున్నా.. ఈ మాట మాత్రం అలాగే ఉంది. నేటికీ కూడా చాలా మంది ఆడపిల్లల్ని ఈ మాట అంటూనే ఉంటారు. మన కాలంలో ఇలా ఉండేది కాదని తల్లిదండ్రులు తమ కూతుళ్లకు ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు సామాజిక మార్పును స్వీకరించాలి. అలాగే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కూతుర్లను ప్రోత్సహించాలి. కానీ ఇలా చేయకూడదని ఆంక్షలు విధించకూడదు. 
 

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు

ఆడవారికి పెళ్లికి మించిన ఎన్నో ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి. వాళ్లకంటూ ఒక గుర్తింపు ఉండాలని, సొంతంగా డబ్బులు సంపాదించాలని ఎన్నో కలలు కంటారు. కాబట్టి ఆ ఆశయాలకు తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలి. కానీ అడ్డంకి కాకూడదు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనేది ఆడవాళ్ల సొంత నిర్ణయం. వారిని ఫోర్స్ చేయకూడదు.

ఇలా దుస్తులు వేసుకోవద్దు

అమ్మాయిల క్యారెక్టర్ అనేది ఆమె వేసుకున్న దుస్తులను బట్టి ఉండదన్న ముచ్చటను ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఎలాంటి బట్టలు వేసుకోవాలన్నది వారి వ్యక్తిగత నిర్ణయం. తప్పుడు పనులు చేస్తే చెప్పే హక్కు ప్రతి పేరెంట్స్ కు ఉంటుంది. కానీ ప్రతి దాన్ని వ్యతిరేకించే హక్కు మాత్రం ఉండదు. 
 

Latest Videos

click me!