ఆహారం
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని చికిత్సలు ప్రభావవంతంగా ఉంటాయి. అయినప్పటికీ కొన్ని ఆహార మార్పులు కూడా చేయాలి. ఎందుకంటే ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లను చూడటం వల్ల కళ్లు పొడిబారుతాయి. ఇలా కాకూడదంటే మీ పిల్లలకు వాల్ నట్స్, సోయా బీన్స్, ఒమేగా 3 ఎక్కువగా ఉండే చేపలను పెట్టండి.
వీటితో పాటుగా విటమిన్ సి పుష్కలంగా ఉండే క్యారెట్, నారింజ పండ్లను కూడా వారి రోజువారి ఆహారంలో చేర్చండి. వీటిలో ఉండే అవసరమైన విటమిన్లు, పోషకాలు యూవీ కిరణాల నుంచి కళ్లను రక్షిస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి.