చాలా మంది.. తమ తల్లిండ్రుల కోసం పిల్లలను కంటూ ఉంటారు. పెళ్లి అవ్వడం ఆలస్యం ఇంట్లో పేరెంట్స్ తమకు మనవడో, మనవరాలు ఇస్తే.. తాము సంతోషంగా వాళ్లతో ఆడుకుంటాం అని అంటూ ఉంటారు.వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అంతిమంగా మీరు పిల్లలకు తల్లిదండ్రులు అవుతారు, అందుకే మీ తల్లిదండ్రులు లేదా అత్తమామలు చేసినప్పుడు కాదు, మీకు కావలసినప్పుడు పిల్లలను కలిగి ఉండటం ముఖ్యం. మీరు కోరుకున్నప్పుడు కాకుండా.. ఇతరుల కోసం పిల్లలను కనడం మంచిది కాదు. వాళ్లు పెంచుతారని కాదు.. మీకు కావాలి అనిపించినప్పుడు పిల్లలను కనడమే మంచిది.